నిరంతరం కొందరికే పదవులా?

రాజకీయాల్లో మార్పులు రావాలి

రెండు టర్మ్‌లకు మించి పదవులను దూరం చేయాలి

ఎన్నికల సంస్కరణలు తక్షణావసరం

హైదరాబాద్‌,నవంబర్‌14(జ‌నంసాక్షి): రాజ్యాంగ పదవుల నిర్వహణలో వ్యక్తులకు నిర్దిష్ట కాలపరిమితి లేకపోవడం వల్ల కొందరే జీవితాంతం నేతలుగా ఉంటున్నారు. నిరంతరాయంగా పదవులను అంటి పెట్టుకోవడం వల్ల అవినీతి వేళ్లూనుకుంటోంది. ప్రజాస్వామ్యంలో సంస్కరణలు రావాలి. ఒక వ్యక్తి కనీసం రెండు టర్మ్‌లకు మించి రాజకీయ పదువులు పొందకుండా చూడాలి. అప్పుడే 120 కోట్ల జనాభా ఉన్న మనదేశంలో అందరికి రాజకీయంగా పదవుఉల దక్కి పాలనలో పారదర్శకత వస్తుంది. కాంగ్రెస్‌ టిక్కెట్ల లొల్లి చూసిన తరవాత ఇప్పుడు ఈ చర్చ సాగాల్సి ఉంది. ఒక్క పొన్నాల లక్ష్మయ్య నిరంతరాయంగా ఎమ్మెల్యేగా ఉండాలన్న రూల్‌ ఉందా? దీనికితోడు టిక్కెట్‌ రాకపోవడంతో ఆయన ఇప్పుడు బిసి జపం చేస్తూ బిసిలకు అన్యాయం జరిగిందని గోల చేస్తున్నారు. నిజానికి జానారెడ్డి, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్‌, కెసిఆర్‌, చంద్రబాబు నాయుడు ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత జాబితా తయారవుతుంది. నిరంతరం కొందరి వ్యక్తుల చేతుల్లోనే ఎందుకు ప్రజాస్వామయం బందీ కావాలి. ఎమ్మెల్‌ఓయే లేదా ఎంపిలుగా రెండు టర్మ్‌లకు మించి ఉండరాదన్న ఎన్నికల సవరణ వస్తే ఇవాళ

టిక్కెటల్‌ కోసం జరుగుతున్న ఆందోళనలు రావు. నిజానికి ఇప్పుడు ఆందోళనలుచేస్తున్న వారు కూడా ఇన్నేళ్లుగా తాము అనుభవించిన పదవులను ఇతరులకు బదలాయించడానికి సిద్దంగా లేదు. అతిపెద్ద ప్రజాస్వామ్య రాజ్యంలో కూడా బలవంతులదే పెత్తనంగా మారింది. డబ్బున్నోళ్లదే రాజ్యంగా నడుస్తోంది. వారి ఆలోచనల మేరకే పాలన సాగుతోంది. పేదలుపేదలుగానే ఉంటున్నారు. పెద్దలు మరింత బలిసి పోతున్నారు. వీరే రాజ్యాధికారం చిక్కించుకుని తమకు అనుకూలంగా పాలన చేస్తున్నారు. ప్రధానంగా బిజెపి లాంటి పార్టీలో కూడా అంతర్గ ప్రజాస్వామ్యం లోపించింది. ప్రధానిగా మోడీ పగ్గాలు చేపట్టిన తరవాత ఏకవ్యక్తి ఛత్రంలోకి పార్టీ వెళ్లింది. సీనియర్లు అద్వానీ, మురళీమనోహర్‌ జోషి,యశ్వతం సిన్హా, అరుణ్‌ శౌరి లాంటి వారికి మాట్లాడే అవకాశం లేదు. కనీసంగా పార్టీలో వారికి ప్రవేశం కూడా లేకుండా చేశారు. దీంతో అంతర్గతంగా సమస్యలను చర్చించడానికి అవకాశం లేకుండా పోతోంది. ఇది ప్రజల సమస్యలను గుర్తించే అవకాశం లేకుండా చేసింది. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు రావు. ధరలు పెరుగుతున్నా తగ్గించే మార్గాలు చూడరు. విద్యవైద్యం వంటి వారికి ఇంకా భరోసా లేదు. అదే పేదల వైద్యానికి గ్యారెంటీ లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఏ రంగంలోనూ ప్రగతి సాధించలేదు. గ్రావిూణ ఆర్థికవ్యవస్థను చిన్నాభిన్నం చేశారు. ఇదంతా కేవలం కొందరే నిరంతరంగా పదవులను పట్టుకుని వేలాడడం వల్ల కొత్త ఆలోచనలు రావడం లేదు. ప్రజాస్వామ్యంలో కొత్త రక్తం ఎక్కడం లేదు. ఇలాంటి పాలకుల తీరు కారణంగా ప్రజలను గండాల నుంచి గట్టెక్కించే బదులు మరో గండంలోకి నెట్టేలా చర్యలు ఉంటున్నాయి. వస్తూత్పత్తి తగ్గి దిగుమతులు పెరిగాయి. వ్యవసాయం చేయాలంటేనే రైతులు భయపడే దుస్థితి నెకొంది. కల్తీ సామ్రాజ్యం ఏలుతోంది. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నా పట్టించుకోవడం లేదు. దీంతో భవిష్యత్‌పై భరోసా లేకుండా పోతోంది. వచ్చే పదేళ్ళొ, 20 ఏళ్ళకో ప్రణాళికలు అంటున్నా అవి కార్యాచరణ దాల్చడం లేదు. మన తర్వాతి తరాలను దృష్టిలో ఉంచుకొని ఆరోగ్యవంతమైన సమాజాన్ని ఇవ్వలేకపోతున్నాం. ఓటుబ్యాంక్‌ రాజకీయాలు దేశాన్ని దివాళా తీయిస్తున్నాయి. కొత్త తరం ఎన్నో అద్భుఆలు ఆవిష్కరిస్తున్నా, రాజకీయాల్లో మాత్రం సాధ్యం కావడం లేదు. కేవలం కొందరే నిరంతరంగా పదవులు పట్టుకుని వేలాడడం వల్ల ఇలా జరగుఉతోంది. పార్టీలుగా రాజకీ సంస్కరణలు తీసుకుని రావాల్సి ఉంది. పార్టీలో ఉన్న వారికి రెండుసార్లకు మించి స్థానం లేదని చెప్పి ముందుగా అమలు చేయాలి. అప్పుడు ఎక్కువమంది నాయకులకు అవకాశాలు వస్తాయి.