పౌష్టికాహారంపై అవగాహన

గద్వాల,సెప్టెంబర్‌11 ( జనంసాక్షి ) :  బాలింతలకు, గర్భిణులకు, కౌ మార బాలికలకు పోషకాహారంపై అవగాహన కల్పి ంచాలని మున్సిపల్‌ కమిషనర్‌, మెప్మా పీడీ న ర్సింహ మెప్మా సి బ్బందికి సూచించారు. జాతీయ పోషకాహర మాసాన్ని పురస్కరించుకుని డీఎంహెచ్‌వో ఆధ్వర్యంలో మెప్మా సిబ్బందికి పోషకాహరంపై అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు.  కార్యక్రమానికి కమిషనర్‌తో పాటు హెచ్‌ఈ మధుసూదన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ పోషకాహారంతో పాటు తల్లి పాల ప్రాముఖ్యతను కూడా తల్లులకు సిబ్బంది వివరించాలన్నారు. పౌష్టికాహారం తీసుకోవడం ద్వారానే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందన్న విషయాన్ని వారికి తెలియజేయాలన్నారు. మధుసూదర్‌రెడ్డి మాట్లాడుతూ అవగాహన కార్యక్రమాలకు తల్లులు, బాలింతలు, కౌమార బాలికలు తప్పనిసరి పాల్గొనేలా చూడాలన్నారు. పౌష్టికహార లోప రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు.