ప్రభుత్వ ఆదేశాల మేరకు చెక్కుల పంపిణీ

యాదాద్రి భువనగిరి,మే4(జ‌నం సాక్షి): రైతుబంధు చెక్కులు, నూతన పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీని పకడ్బందీగా చేపట్టేందుకు ప్రణాళికలు సిద్దం చేశారు. ఈనెల 10 నుంరి జరగనున్న వీటి పంపిణీపై కార్యాచరణ రూపొందించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్‌ అనితా రామచంద్రన్‌ తెలిపారు. పంపిణీ సమయంలో రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా సదుపాయాల కల్పనపై దృష్టిపెట్టారు. పంపిణీ కేంద్రాల వద్ద షామియానాలు, మంచినీటి సదుపాయం కల్పించడంతోపాటు ముందస్తుగా పట్టాదారులకు చీటీలు పంపిణీ చేయనున్నారు. గ్రామాల్లో  ముందస్తుగా విస్తృత ప్రచారం చేపట్టాలన్నారు. సాంకేతిక సమస్యలతో ఆధార్‌ అనుసంధానం కానివారికి రైతుబంధు చెక్కుల పంపిణీకి చర్యలు తీసుకుంటున్నారు. మండలాలకు వెళ్లే బృందాలు తప్పనిసరిగా పహాణీ కాపీలను తమ వెంట తీసుకెళ్లాలని కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ క్షేత్రస్థాయి అధికరాఉకలు  సూచించారు. ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. రైతుబంధు చెక్కులు, పాస్‌పుస్తకాల పంపిణీకి సంబంధించి జిల్లాకు రూ.2 కోట్ల చొప్పున మంజూరు చేసినట్లు తెలిపారు. 
—-