మహిళలకు పెద్దపీట యాది మార్చిన ప్రభుత్వం

 

 

 

 

 

 

మహిళా సంఘాల ఆవేదనరాజంపేట్ జనవరి 30 (జనంసాక్షి)కామారెడ్డి నియోజకవర్గ పరిధిలోని రాజంపేట్ మండలములోని 6 గ్రామాల మహిళా సంఘాల సభ్యులు తమకు రావలసిన వడ్డీ లేని రుణాలు, అభయ హస్తం కింద మహిళలు కట్టిన డబ్బులు విడుదల చేయాలని పెద్దమ్మ గుడి నుండి పురవీధుల్లో ర్యాలీ ప్రారంభమైన ర్యాలీ నిర్వహించి రాజంపేట్ మండల ప్రజా పరిషత్ కార్యాలయానికి చేరుకుని వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
అనంతరం బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇంఛార్జి కాటిపల్లి వెంకట రమణ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా సంఘాలు అంటే కేవలం వడ్డీ లకు రుణాలు ఇచ్చే యేజెన్సి గా మార్చిందని అందులో గతంలో మహిళా సంఘాలకు అనేక రకాల పతకాలు రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసిందని చివరికి మహిళకు రావలసిన రుణాల వడ్డీ గత 5 సంవత్సరాలుగా ఖాతాల్లో వేయటం లేదని అభయ హస్తం పథకం కింద డబ్బులు కట్టిన మహిళలు ఏదైనా ఆపద వచ్చి చనిపోతే అదే రోజు 5000 రూపాయలు ఇచ్చి తర్వాత 30 వేళ రూపాయలు వల్ల కుటుంబానికి ఇచ్చే వారని కాని ఇప్పుడు ఆ పథకం ఎత్తి వేశారని, మహిళలు కట్టిన డబ్బులు కూడా వారికి ఇవ్వడం లేదనీ అన్ని డబ్బులు వచ్చే వరకు ఉద్యమం కొనసాగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు