రుణాల కొరకు ఇంటర్య్వూలకు హాజరుకావాలి

భద్రాద్రి కొత్తగూడెం : కొత్తగూడెం పట్టణంలో బిసి కార్పోరేషన్‌ పథకం ద్వారా 2017-18 సంవత్సరంనకు ఆన్‌లైన్‌ ద్వారా చేసుకొన్న రూ. 1 లక్ష నుండి రెండు లక్షల లోన్స్‌ కొరకు దరఖాస్తు చేసుకొన్న దరఖాస్తు దారులు ఈ నెల 29వ తేదీన ఉదయం 10.30 గంటలకు మున్సిపల్‌ కార్యాలయం నందు జరుగు ఇంటర్వ్యూలు హాజరుకావాలని మున్సిపల్‌ కమిషనర్‌ ఒక ప్రకటనలో తెలియజేశారు. దరఖాస్తు దారులు సంబంధిత కులము, ఆదాయంతో పాటు తమ యొక్క సంబంధిత అనగా 2018 సంవత్సరంకు సంబంధించిన అన్ని ఒరిజినల్‌ సర్టిఫికెట్స్‌, ఆధార్‌ కార్డు, రేషన్‌ కార్డులు తీసుకొని ఇంటర్య్వూకు హాజరుకావాలని కోరారు.