లింగమంతులస్వామి జాతరకు సర్వం సిద్దం 

అనవాయితీ మేరకునేటి అర్థరాత్రి దిష్టిపూజ
సూర్యాపేట,ఫిబ్రవరి9(జ‌నంసాక్షి): తెలంగాణలోనే రెండో అతిపెద్ద జాతరగా పేరొందిన పెద్దగట్టు లింగమంతులస్వామి జాతరకు సర్వం అంతా సిద్దం అయ్యింది. ఈనెల 24నుంచి జరుగనున్న జాతరకు ఆచారం ప్రకారం 15రోజుల ముందు వచ్చే ఆదివారం అర్థరాత్రి యాదవుల భేరీల చప్పుళ్లు… ఓలింగా నామస్మరణలతో దిష్టిపూజను సాంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తారు.  అనవాయితీగా దిష్టిపూజ  ఆదివారం అర్థరాత్రి ఘనంగా నిర్వహించనున్నారు. ఆదివారం రాత్రి కుమ్మరివారి నుంచి కొత్త కుండలు తెచ్చి మెంతబొయిన, గొర్ల, మున్న కులస్తులు తమతో తీసుకువచ్చిన బియ్యంతో అన్నం వండి రెండు బోనాలు తయారు చేసి పూజలు చేస్తారు. అనంతరం దీపారాధన కార్యక్రమంలో భాగంగా చంద్రపట్నం వేసి రెండు రాసులుగా దిష్టి కుంభాలు పోస్తారు. ఆ దిష్టికుంబాలను కంచుడు వలె తయారు చేసి వాటిలో నెయ్యి పోసి దీపారాధన చేస్తారు. బైకాని(యాచకులు) వారు యాదవుల చరివూతలకు సంబంధించిన కథలను చెప్పుకుంటూ యాదవుల సంప్రదాయం ప్రకారం మెంతబోయిన, గొర్ల, మున్న వంశస్తులకు పసుపు పెడతారు. తదనంతరం దిష్టికుంభాలను పాలు, నెయ్యి, పెరుగులతో కలిపి అక్కడికి వచ్చిన భక్తులకు ప్రసాదంగా పెట్టిన అనంతరం అర్థరాత్రి దాటిన తరువాత చౌడమ్మ కు ఎదురుగా పిల్లతల్లి గొర్రెను బలివ్వనున్నారు. దీంతో దిష్టిపూజ మ¬త్సవం ముగిస్తుంది. పక్షం రో జుల అనంతరం వచ్చే ఆదివారం అర్థరాత్రి పెద్దగట్టు లింగమంతులస్వామి జాతర ప్రారంభమై ఐదు రోజులపాటు కొనసాగనుంది.
దిష్టిపూజ సందర్బంగా ఆదివారం రాత్రి కేసారంలో జరుగనున్న ప్రత్యేక పూజల్లో మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్‌డ్డి పాల్గొంటారు. ఆయనతో పాటు రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్యయాదవ్‌, కలెక్టర్‌ అమాయ్‌కుమార్‌, ఎస్పీ వెంక పాటు పెద్దగట్టు పాలకవర్గ సభ్యులు, ప్రజావూపతినిధులు, యాదవ కుల సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొంటారు.