వేతన జీవులను నిరాశ పర్చిన కేంద్ర బడ్జెట్

 

 

 

 

 

 

 

 

* వేతన జీవులను నిరాశ పర్చిన కేంద్ర బడ్జెట్*  యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు ముల్కల కుమార్*
వీణవంక  ఫిబ్రవరి 1 (జనం సాక్షి)  వీణవంక  ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని స్వల్పంగా పెంచి మధ్యతరగతి వేతన జీవులకు భారీ ఊరట పేరుతో ప్రచారం చేసుకోవటం సమంజసం కాదని యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు ముల్కల కుమార్ పేర్కొన్నారు.పాత, కొత్త పన్ను విధానాలను కొనసాగిస్తూ క్రమంగా పాత పన్ను విధానాన్ని ఎత్తివేయటానికే కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు ఈ బడ్జెట్ ద్వారా స్పష్టమైంది. పరోక్ష పన్నుల ద్వారా వేతనాలనుండి ఆదాయాన్ని రాబట్టుకుంటున్న ప్రభుత్వం వేతనాలపై భారీగా పన్ను వేయటమే అర్థరహితం. కార్పోరేట్లు, ధనికులకు అధిక పన్ను రాయితీ ఇచ్చిన ప్రభుత్వం చిన్న, మధ్యతరగతి ఉద్యోగులకు ఏమాత్రం ప్రయోజనం కలిగించలేదు.కొత్త పన్ను విధానంలో పన్ను రాయితీ రూ 5.00 నుండి రూ 7.00 లక్షలకు పెంచారు కానీ కొత్త విధానంలో ఎలాంటి మినహాయింపులు ఉండవు. అధికాదాయ వర్గాలకు మాత్రమే ఇది కొంత మేరకు ఉపయోగకరం.తక్కువ వేతనాదాయ వర్గాలు వినియోగించుకుంటున్న పాత పన్ను విధానం లో స్టాండర్డ్ డిడక్షన్ రూ 2.50 లక్షల నుండి రూ 3.00 లక్షలకు పెంచటం నామ మాత్రమే. పొదుపు మొత్తాలపై రాయితీని రూ 1.50 లక్షలను అలాగే కొనసాగించారు. 2014 కు ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బిజెపి డిమాండ్ చేసిన స్టాండర్డ్ డిడక్షన్ రూ 5.00 లక్షలు గానీ పొదుపు మొత్తాలపై రూ 3.00 లక్షలకు పెంచాలన్న డిమాండ్ కానీ అధికారంలోకి వచ్చిన తొమ్మిదేళ్ళ తర్వాత కూడా అమలు చేయలేదు. స్లాబు రేట్లు సవరణ కూడా స్వల్పంగానే ఉంది. ఈ బడ్జెట్ ద్వారా ధరలు ఏమాత్రం తగ్గే అవకాశం లేదు. గృహ నిర్మాణానికి ప్రోత్సాహం లేదు. మొత్తంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతపాదించిన బడ్జెట్ సగటు వేతన జీవులకు ఏమాత్రం సంతృప్తిని కలిగించలేదన్నారు.