27నుంచి ఇంటర్‌ పరీక్షలు

– పరీక్షల నిర్వహణకు 1277 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు
– పరీక్షలకు హాజరు కానున్న 9,42,719 మంది విద్యార్థులు
– నిమిషం ఆలస్యమైనా లోపలికి అనుమతించం
– తెలంగాణ విద్యా మండలి ఇంటర్మీడియట్‌ బోర్డు వెల్లడి
హైదరాబాద్‌, ఫిబ్రవరి25(ఆర్‌ఎన్‌ఎ) : ఈనెల 27నుంచి మార్చి 13 వరకు తెలంగాణ వ్యాప్తంగా ఇంటర్మీడియట్‌ బోర్డు ఎగ్జామ్స్‌ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేశామని సోమవారం తెలంగాణ విద్యామండలి ఇంటర్మీడియట్‌ బోర్డు తెలిపింది. పరీక్షల నిర్వహణపై అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేశామని అధికారులు తెలిపారు. ఉదయం 8 గంటల లోపు విద్యార్థులు పరీక్ష కేంద్రం చేరుకోవాలని సూచించారు. అలాగే 8.45కు సెంటర్‌ లోపలికి వెళ్లిపోవాలని, ఉదయం 9 గంటలకు ఒక్కనిమిషం ఆలస్యమైన లోపలికి అనుమతించరని బోర్డు అధికారులు చెప్పారు. మొత్తం 1277 ఎగ్జామ్‌ సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. మొత్తం 1277 చీఫ్‌ సూపర్‌ డేంట్‌ ఆఫీసర్లు, 1277 డిపార్ట్మెరట్‌ ఆఫీసర్లు అందుబాటులో ఉంటారని తెలిపారు. ఈసారి మొత్తం ఇన్విజిలేటర్‌ లు 24508 మంది, పరీక్షలు రాస్తున్న విద్యార్థులు మొత్తం 942719 మంది, మొదటి సంవత్సరం 452550 మంది రెండవ సంవత్సరం 490169 మంది విద్యార్థులు ఎగ్జామ్స్‌ రాస్తున్నానట్లు చెప్పారు. ఇవాళ (సోమవారం) సాయంత్రం నాలుగు గంటలకు ఆన్‌లైన్‌లో హల్‌టికెట్స్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. సెంటర్లు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవటానికి ఎగ్జామ్‌ సెంటర్‌ జూ అందుబాటులో వుందన్నారు. ఆ యాప్‌లో హల్‌ టికెట్స్‌ నంబర్‌ ఎంటర్‌ చేసి సెంటర్‌ ఎక్కడ వుందో తెలుసుకోవచ్చని సూచించారు. హల్‌టికెట్స్‌ లేకుంటే పరీక్షా కేంద్రం లోపలికి అనుమతించరని హెచ్చరిక జారీ చేశారు. ఎగ్జామ్‌ సెంటర్స్‌ సవిూపంలో జిరాక్స్‌ సెంటర్లు వుండవని చెప్పారు. అన్ని శాఖలతో సమన్వయం చేస్తూ ఎగ్జామ్‌ మంచిగా జరిగేందుకు చూస్తున్నమని విద్యామండలి ఇంటర్మీడియట్‌ బోర్డు తెలిపింది. అలాగే విద్యార్థులకు హాల్‌టికెట్లు ఇవ్వని కాలేజీలపై కటినచర్యలు తీసుకుంటామన్నారు.