రాష్ట్రపతి శీతాకాల విడిది కోసం  హకీంపేట ఎయిర్ పోర్టులో సర్వం సిద్ధం.

share on facebook

మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఎం.వి రెడ్డి అధికారులకు ఆదేశాలు………..
మేడ్చల్ జిల్లా,(జనం సాక్షి): రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శీతాకాల విడిది కోసం హైదరాబాద్ కు ఈనెల 20 నుండి 28 వరకు రాష్ట్రపతి నిలయం, సికింద్రాబాద్లోని బొల్లారం రానున్న సందర్భంగా హకీంపేట్ ఎయిర్ పోర్ట్ లో చేయవలసిన ఏర్పాట్లను పటిష్టంగా చేయాలని కలెక్టర్ ఎం వి రెడ్డి  అధికారులను ఆదేశించారు. శుక్రవారం హకీంపేట్ ఎయిర్ పోర్టు సమావేశ మందిరంలో లో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోలీసు అధికారులను పూర్తిస్థాయి బందోబస్తు ను ఏర్పాటు చేయాలని, రాష్ట్రపతి దిగిన ఇయర్ క్రాఫ్ట్ ను రెండంచెల భద్రత కల్పించాలన్నారు. అక్కంపేట ఎయిర్ పోర్టు నుండి రాష్ట్రపతి నిలయం, బొల్లారం వరకు కు ఉన్న రోడ్డును శుభ్రంగా, ఎటువంటి గుంటలు లేకుండా మరమ్మతులు చేయాలని ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించారు. ఎయిర్పోర్టులో వీఐపీల రాక సందర్భంగా వాటర్ప్రూఫ్ శ్యామ్యానా తదితర ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. రోడ్లను శుభ్రంగా చేయాలని అని మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. ప్రత్యేక డాక్టర్ల తో అవసరమైన మందులు ఏర్పాటు చేయాలన్నారు. 108 వాహనం తగు సిబ్బంది ఏర్పాటు చేయాలని వైద్యాధికారులను ఆదేశించారు. విద్యుత్ కోసం జనరేటర్లను ఏర్పాటు చేసుకోవాలని విద్యుత్ శాఖ ఏఈ ను ఆదేశించారు.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు మరియు అగ్ని ప్రమాదాలు జరగకుండా అగ్నిమాపక వాహనాన్ని సిద్ధంగా ఉంచాలని జిల్లా అగ్నిమాపక అధికారి ఆదేశించారు. విఐపి విడిది కోసం అం మరుగుదొడ్లను ఏర్పాటు చేయాలని జిహెచ్ఎంసి ఈ ఈను, వినసొంపైన సంగీతాన్ని పెట్టాలని రేడియో ఇంజనీర్లను ఆదేశించారు. టిఎస్ ఓపెన్ మంచినీటి, స్నాక్స్ ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ సమావేశంలో ఎయిర్ ఫోర్స్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ ఆర్ కె రెడ్డి, జెసి విద్యాసాగర్, ఎయిర్ పోర్టు అధికారి సాహ న్ సింగ్, డిఆర్ఓ మధుకర్ రెడ్డి, ఆర్ డి ఓ మధుసూదన్, డిఎం అండ్ హెచ్ఓ నారాయణ, ఆర్ అండ్ బి ఈ ఈ ఈ చందర్ సింగ్, డి సి ఓ రమేష్, తూముకుంట మున్సిపల్ కమిషనర్ వాణి, శామీర్ పేట్ తహసిల్దార్ గోవర్ధన్, జిల్లా అగ్నిమాపక అధికారి కిషోర్, రేడియా ఇంజనీర్ నాగ అంజలి, పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Other News

Comments are closed.