రేవంత్‌ నోరు తెరిస్తే రోతే

 

 

 

 

 

 

 

డిసెంబర్ 25 (జనం సాక్షి): మాన్యులు గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఫ్రస్ట్రేషన్‌ పీక్స్‌కు చేరింది. కేసీఆర్‌ బయటకు రావడంతో పట్టుకున్న భయం శరీరాన్ని, మెదడును ఆవహించింది. ఏం చేస్తున్నాడో అర్థంగానీ అయోమయంలో నోటి నుంచి బూతులు వదులుతూనే ఉన్నారు. కొడంగల్‌ నియోజకవర్గంలోని కోస్గిలో బుధవారం నిర్వహించిన సర్పంచ్‌, ఉపసర్పంచ్‌ల అభినందన సభ అందుకు వేదికైంది. సభలో తెలంగాణ జాతిపిత, ఉద్యమనేత, ప్రగతి ప్రదాత, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌ గారిపై గౌరవనీయులైన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి స్థాయిని మరచి పరుషపదజాలంతో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సాధారణంగా ఒక ముఖ్యమంత్రి ఇటువంటి భాష మాట్లాడకూడదు. ఒక పత్రికగా దీన్ని ప్రచురించకూడదు. పాత్రికేయ ప్రమాణాలకు ఇది విరుద్ధం. ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి ప్రయోగిస్తున్న భాష ఏంటిది? ఆయన ఏ స్థాయి భాష వాడుతున్నారు? అని చెప్పటానికి, తెలంగాణ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న ఒక వ్యక్తి, ఎటువంటి భాష మాట్లాడుతున్నడు? ఏ స్థాయికి దిగజారుతున్నడు? అన్నదే చరిత్ర పుటల్లోకి రికార్డు కావాల్సిన అవసరం ఉన్నది. అందుకోసమని పాత్రికేయ ప్రమాణాలను ఉల్లంఘిస్తూ.. ఆయన భాషను ప్రచురించక తప్పటం లేదు. ఇందుకు చింతిస్తున్నాం

ప్రజలారా మీరే నిర్ణేతలు
కేసీఆర్‌ ఒక ఉద్యమనేత. తన 45 ఏండ్ల రాజకీయ జీవితమంతా తెలంగాణ కోసమే పరితపించిండు. పదవులన్నీ వదులుకొని 14 ఏండ్ల సుదీర్ఘ తెలంగాణ ఉద్యమం, 10 ఏండ్లు తెలంగాణను అత్యద్భుతమైన ప్రగతిపథంలో నడిపిండు. రేవంత్‌రెడ్డికి తండ్రి అంత వయస్సున్న వ్యక్తి. మొన్న ఆయన కనీసం రేవంత్‌ పేరునే ఎత్తలేదు. సబ్జెక్ట్‌ తప్ప ఒక్క బూతుమాట మాట్లాడలేదు. తెలంగాణ ప్రజల క్షేమం కోసమే కేసీఆర్‌ మాట్లాడిండు. ఎప్పుడూ నా చావు కోరుడేనా? అని ప్రశ్నించిండు. తెలంగాణ మేలు కోరండి అని ఉద్బోధించిండు. అయినా సరే, అటువంటి ఒక మహా నాయకుడిపై తెలంగాణ సీఎంగా ఉన్న రేవంత్‌రెడ్డి ఇటువంటి భాష మాట్లాడటం సరైనదేనా? మీరే నిర్ణయించండి.