అక్రమంగ తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం దేశాయ్ పల్లి గ్రామ శివారులో టాటా ఏసీ ఆటో నెంబర్ TS 03 UB 7626 వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 20 క్వింటల ప్రభుత్వ రేషన్ బియ్యం స్వాధీన పరుచుకొని వాహనా డ్రైవర్ బత్తుల రాజు ను అదుపులోకి తీసుకున్న బోయిన్ పల్లి ఎస్ ఐ అభిలాష్. ఎస్ ఐ మాట్లాడుతూ ప్రభుత్వ బియ్యం అక్రమంగా తరలించడం చట్టరీత్యా నేరమని రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా ఆయన తెలిపారు పట్టుకున్న వారిలో బోయినపల్లి పోలీస్ సిబ్బంది ఉన్నారు.