అగ్ని ప్రమాదంలో ఇల్లు దగ్ధం

కమలాపూర్‌: కమలాపూర్‌ మండలం కన్నూర్‌లో ప్రమాదవశాత్తు నిప్పంటుకుని జి.డి శంకర్‌కు చెందిన నివాస గృహం దగ్ధమైంది. ప్రమాద సమయంలో శంకర్‌తల్లి తల్లి , ఏడునెలల చిన్నారి ఇంట్లో ఉన్నారు. అతని భార్య ప్రమాదాన్ని గమనించి వారిని బయటకు తీసుకురావడంతో ప్రాణ నష్టం తప్పింది. నగదు., గృహోపకరణాలు పూర్తిగా దగ్ధం కావడంతో బాధితులు కట్టుబట్టలతో మిగిలారు. నీటి వినియోగదారుల సంఘం ఛైర్మన్‌ రామారావు బాధితులకు రూ. 3వేలు సహాయం అందించారు.