ఉపరాష్ట్రపతితో గవర్నర్ భేటీ
ఢిల్లీ: ఢిల్లీలో ఉన్న రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ఈ రోజు ఉదయం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో భేటీ అయ్యారు. అనంతరం ఆయన ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీతో సమావేశమయ్యారు. ఉపరాష్ట్రపతితో ఇరవై నిమిషాల పాటు సమావేశమైన నరసింహన్ రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితుల గురించి ఆయనతో చర్చించినట్లు భావిస్తున్నారు.



