తెలుగు మీడియా సంస్థలకు బండి సంజయ్ నోటీసులు

మే 25 (జనం సాక్షి):పోక్సో కేసులో తన పేరు ఉపయోగించి.. తన పరువుకు భంగం కలిగించారంటూ తెలుగు మీడియా సంస్థలకు, డిజిటల్‌ మీడియాకు, యూట్యూబర్లకు, పలు పార్టీల హ్యాండిల్స్‌కు, పలువురు నెటిజన్లకు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌ పరువునష్టం దావా నోటీసులు పంపారుకాగా, ఇదే అంశంపై వార్తలు రాసిన నేషనల్‌ మీడియాను మాత్రం ఆయన వదిలేశారు. దాదాపు 250కి పైగా పేజీల్లో వందలాది మంది పేర్లను, మీడియా సంస్థలను, సోషల్‌ మీడియా హ్యాండిల్స్‌ను చేర్చారు. ఇందులో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌కు చెందిన పలువురు ప్రజాప్రతినిధులూ ఉన్నారు. గూగుల్‌, మెటా, ఎక్స్‌ సంస్థలకు సైతం ఆయన నోటీసులు పంపారు.

తాజావార్తలు