ఉప్పల్ చిలకనగర్‌లో కోటిలింగాల స్థాపన మహోత్సవానికి శ్రీకారం

 

 

 

 

 

 

దివ్య ఆశీస్సులతో లింగాల బుక్కింగ్‌, కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహణ

ఉప్పల్, మే 25(జనం సాక్షి): ఉప్పల్ చిలకనగర్‌లోని హరిహర క్షేత్రం శ్రీ చిలుకేశ్వర ఆంజనేయ స్వామి దేవాలయం సన్నిధిలో జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి వారి దివ్య ఆశీస్సులతో నిర్వహించనున్న “కోటిలింగాల స్థాపన మహోత్సవం” కార్యక్రమానికి సంబంధించిన లింగాల బుక్కింగ్‌, కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి హాజరై కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఆలయ ప్రాంగణంలో వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, హరిహర క్షేత్రం ఆధ్యాత్మిక కేంద్రంగా మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఆలయ అభివృద్ధికి తన పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల నాయకులు, ప్రజలు, భక్తులు ఆలయ పునర్నిర్మాణానికి సహకరించాలని పిలుపునిచ్చారు. కోటిలింగాల స్థాపన కార్యక్రమం భక్తుల ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించే మహత్తర యజ్ఞమని పేర్కొన్నారు.అలాగే ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమంలో ప్రతి భక్తుడు భాగస్వామి కావాలని, దైవ సేవలో అందరూ తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని ఎమ్మెల్యే సూచించారు. ఆలయం అభివృద్ధి చెందితే ప్రాంతానికి ఆధ్యాత్మిక కాంతి మరింత విస్తరిస్తుందని అన్నారు.ఆలయ కమిటీ అధ్యక్షులు దాసరి కృష్ణ మాట్లాడుతూ, కోటిలింగాల స్థాపన మహోత్సవంలో భాగంగా అష్టోత్తర 108 లింగాలకు రూ.2,116/- మరియు సహస్ర 1008 లింగాలకు రూ.21,116/- విరాళంగా అందించి భక్తులు కార్యక్రమంలో పాల్గొని పరమేశ్వరుని కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ మహోత్సవం ద్వారా సమాజంలో ధార్మిక చైతన్యం పెంపొందుతుందని తెలిపారు.ఆలయ పునర్నిర్మాణం, అభివృద్ధి కార్యక్రమాలకు భక్తులు, దాతలు, ప్రజలు విరాళాలు అందించి సహకరించాలని కమిటీ సభ్యులు విజ్ఞప్తి చేశారు. కోటిలింగాల ప్రతిష్ఠ కార్యక్రమం ఉప్పల్ ప్రాంత చరిత్రలో ఒక విశిష్ట ఆధ్యాత్మిక ఘట్టంగా నిలిచిపోతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి గోనె శ్రీకాంత్ వ్యవహరించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, సామాజిక సేవకులు, యువకులు, భక్తులు విశేషంగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా పాల్గొన్న వారిలో బన్నాల ప్రవీణ్, ఆలయ మాజీ ప్రధాన కార్యదర్శి, ఉప్పల్ ప్రెస్ క్లబ్ (ప్రింట్ & ఎలక్ట్రానిక్) అధ్యక్షులు వడ్డేపల్లి కిషోర్, బూరుగల రమేష్ గౌడ్, జెల్లీ మొహన్, అమృత్ లావు, గోనె అంజయ్య, దేవసాని బాలచందర్, చాతరాసి సిధిరాజు, పాల్వంచ విఠల్, జయధీర్, కొంపల్లి రవీందర్, దేవుల పురుషోత్తం, ఆర్. బలరామ్, గూడ శ్రీశైలం, కావాలి నరసింహ, కొంగరి రామచంద్రర్, మాస శేఖర్, బోడ విద్యాసాగర్, శామీర్‌పేట చంద్రయ్య, గుర్రాల మల్లేష్, పల్లె నర్సంగ్ రావు, ఈరెళ్లి రవీందర్ రెడ్డి, సంఘీ స్వామి యాదవ్, ఓర్సు శేఖర్, సీకూరీ కృష్ణ, అకిటి బాల్ రెడ్డి, అనసూయ రెడ్డి, వాసు, గజ్జల సత్యరాజ్, మడిపడేగ శ్రీనివాస్, రవీందర్ గౌడ్, జల్లీ ప్రశాంత్, శ్రీనివాస్, వంశీ, మార్వాడీ అసోసియేషన్ సభ్యులు తదితరులు ఉన్నారు.ఆధ్యాత్మిక వాతావరణంలో నిర్వహించిన ఈ కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకోగా, కోటిలింగాల మహోత్సవానికి స్థానికంగా విశేష స్పందన లభిస్తోంది.

తాజావార్తలు