అహంకారంగా వ్యవహరిస్తే అధికారం దింపడం ఖాయం – బుగ్గవీటి సరళ

 

 

 

 

 

 

పెన్షన్ ల కోసం పోటెత్తిన లబ్ధిదారులు….

సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో కార్పొరేషన్ కార్యాలయం వద్ద మహాధర్నా…
ఖమ్మం, (జనంసాక్షి) : అర్హులైన కొత్త లబ్ధి దారులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీ ప్రకారం నూతన పెన్షన్ లు ఇవ్వాలని, పెన్షన్ ను 2016 రూపాయలు నుంచి 4016 రూపాయలు పెంచి ఇవ్వాలని, ఖమ్మం నగరంలో పెంచిన ఆస్తి పన్నులు వెంటనే తగ్గించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు బుగ్గవీటి సరళ, సిపిఎం ఖమ్మం డివిజన్ కార్యదర్శి వై విక్రమ్ డిమాండ్ చేశారు. కొత్త లబ్ధి దారులకు కొత్త పెన్షన్ లు ఇవ్వాలని, ఎన్నికల హామీలు అమలుపరచాలని, ఖమ్మం నగర ప్రజలపై వేసిన ఇంటి టాక్స్ లు తగ్గించాలని డిమాండ్ చేస్తూ సోమవారం CPM పార్టీ ఖమ్మం డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో కార్పొరేషన్ కార్యాలయం వద్ద మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వందలాది మంది అర్హులు తమకు కొత్త పెన్షన్ లు ఇవ్వాలని కోరుతూ ధర్నా కు హాజరుఅయ్యారు ఈ సందర్భంగా పార్టీ డివిజన్ కార్యదర్శి వై విక్రమ్ అధ్యక్షతన జరిగిన ధర్నాను ఉద్ధేశించి పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు బుగ్గవీటి సరళ మాట్లాడుతూ 10 సంవత్సరాలుగా అధికారానికి దూరంగా వుండి, ప్రజలకు అనేక హామీలు ఇచ్చి అధికారంలో వచ్చిన కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆచరణలో మాత్రం ప్రజల పట్ల గత ప్రభుత్వ ఎలా వ్యవహరించిందో ఈ ప్రభుత్వం కూడా ప్రజల పట్ల అలాగే వుంటుంది అని, ఇలా ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ఈ ప్రభుత్వాన్ని కూడా అధికారం దింపడం ఖాయం అని హెచ్చరించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల అహంకారంగా వుండి ప్రజా సంక్షేమం పట్ల ఉదాసీనత గా వుంటే తెలంగాణ ప్రజలు అధికారం దింపడం ఖాయం అని హెచ్చరించారు. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలు ఫలితంగా సగటు మనిషి జీవితం రోజు రోజుకు ఆర్థిక దిగ్బంధం లోకి వెళ్లి అప్పులు పాలు అవుతున్నారు అని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి రోజూ పెట్రోల్ డీజిల్, గ్యాస్ ధరలు మోడీ భవితవ్యం పెంచుతుంది అని విమర్శించారు. ప్రభుత్యం ఇస్తున్న పెన్షన్ 2000 రూపాయలు నుంచి 4000 రూపాయలు పెంచాలని డిమాండ్ చేశారు. 57 సంవత్సరాలు నిండిన వారికి నూతన పెన్షన్ లు ఇస్తామని ఇచ్చిన హామీ వెంటనే అమలు పరచాలని డిమాండ్ చేశారు. ఎక్కడ లేని విధంగా ఖమ్మం నగర ప్రజలపై ఇంటి పన్నులు భారాలు వేశారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రయివేటు సంస్థకు ఇచ్చి అడ్డగోలుగా ఇంటి టాక్స్ లు వేశారు అని దుయ్యబట్టారు. ఇంటి టాక్స్ లు తగ్గించకపోతే దశల వారీగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. పింఛన్లు వెరిఫికేషన్ పేరుతో అర్హత వున్న తొలగిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఇందిరమ్మ ఇళ్లకు ఒకే సారి ఐదు లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఖమ్మం నగరంలో అనేక ప్రజా సమస్యలపై జిల్లా మంత్రి, కమిషనర్ దృష్టి సారించాలి అని సరళ డిమాండ్ చేశారు. అనంతం డిప్యూటీ కమిషనర్ కు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బొంతు రాంబాబు, యర్రా శ్రీనివాస రావు, మెరుగు సత్యనారాయణ, జిల్లా కమిటీ సభ్యులు ఎం ఎ జబ్బార్, మీరా సాహిబ్, దొంగల తిరుపతిరావు, ఎస్.నవీన్ రెడ్డి, బండారు రమేష్, ఎస్. కె. నాగుల మీరా, బోడపట్ల సుదర్శన్, ఉపేందర్, వజేనేపల్లి శ్రీనువాసురావు, పి నాగసులోచన, మాజీ కార్పొరేటర్లు ఎల్లంపల్లి వెంకట్రావు, యర్రాగోపీ, నాయకులు ప్రవీణ్ , మధు తదితరులు పాల్గొన్నారు.