ఐఐఆర్‌ఎం ఉత్తీర్ణులైన విద్యార్థులకు స్నాతకోత్సవం

హైదరాబాద్‌: ఇనిస్ట్యూట్‌ ఆఫ్‌ ఇన్సూరెన్స్‌ అండ్‌ రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఆర్‌ఎం) ఏడో స్నాతకోత్సవం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ స్నాతకోత్సవానికి ముఖ్యఅతిథిగా సెబీ మాజీ అధ్యక్షుడు జి.ఎస్‌.బాజ్‌పాయ్‌ హాజరయ్యారు. ఐఐఆర్‌ఎంలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు డిప్లమోలు ప్రాదనం చేశారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన ముగ్గురు విద్యార్థులను బంగారు పతకం, లక్ష రూపాయల నగదుతో సత్కరించారు.