ఒలింపిక్స్‌ నుంచి పేస్‌ – విష్టు జోడీ నిష్క్రమణ

లండన్‌, ఆగస్టు 2 : లండన్‌ ఒలింపిక్స్‌ నుంచి భారత టెన్నిస్‌ డబుల్స్‌ క్రీడాకారులు లియాండర్‌ పేస్‌, విష్ణువర్దన్‌ జోడీ నిష్క్రమించింది. పురుషుల డబుల్స్‌ రెండో రౌండ్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో ఫ్రాన్స్‌కు చెందిన రెండో సీడ్‌ జంట సోంగా-మైకేల్‌ లోద్రాపై 6-7, 4-6, 3-6 తేడాతో పేస్‌ జోడీ ఓడిపోయింది. హోరా హోరీగా సాగిన తొలి సెట్‌లో పేప్‌ – విష్ణు జోడీ కాస్త మెరుగ్గా రాణించిన్పటికీ మూడు సెట్లలో మ్యాచ్‌ ఫలితం తారుమారైంది.ఆటలో ఒకానొక దశలో ఎవరూ సర్వీస్‌ కోల్పోకపోవడంతో సెట్‌ టైబ్రేకర్‌కు దారి తీసింది. ఇందులో సోంగా, లోద్రా జంట నెగ్గింది. రెండో సెట్‌ను పేస్‌-విష్ణు జోడీ గెల్చుకున్నా కీలకమైన మూడో సెట్‌లో మాత్రం బ్రేక్‌ పాయింట్‌ ఇచ్చి మ్యాచ్‌ పరాజయం పాలై టోర్నీ నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే.