సదాశివపేటలో ఘనంగా హోలీ సంబరాలు
జిటిఆర్ డెవలపర్స్ ఆధ్వర్యంలో ఉత్సాహంగా హోలీ వేడుకలు
సదాశివపేట మార్చి 3(జనం సాక్షి)సదాశివపేటలో హోలీ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. చిన్న, పెద్ద కలిసి రంగులు చల్లుకుంటూ సంబరాలు చేసుకున్నారు. పట్టణంలోని 22వ వార్డు జిటిఆర్ కాలనీలో వార్డు కౌన్సిలర్ గారెల గౌరీదేవి తుల్జారం, జిటిఆర్ డెవలపర్స్ అధ్యక్షుడు తుల్జారాం ఆధ్వర్యంలో హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు.చిన్నారులతో, యువకులు, పెద్దలతో కలిసి హోలీని ఉత్సాహంగా ఆడుతూ, ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ, డీజే పాటలతో నృత్యాలు చేస్తూ పండుగను వైభవంగా జరుపుకున్నారు.



