కుటుంబ సభ్యులతో కలిసి రాహుల్ గాంధీని కలిసిన డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క

 

 

 

 

వికారాబాద్ అనంతగిరిలో డీసీసీ అధ్యక్షుల శిక్షణా శిబిరం ఘనంగా ముగింపు.

కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ప్రతిని, మార్చ్ 03(జనంసాక్షి):
వికారాబాద్ జిల్లా అనంతగిరి హిల్స్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల డీసీసీ అధ్యక్షులకు నిర్వహించిన పది రోజుల శిక్షణా శిబిరం ముగింపు కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా కుమరం భీమ్ ఆసిఫాబాద్ డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క తన కుటుంబ సభ్యులతో కలిసి రాహుల్ గాంధీని మర్యాదపూర్వకంగా కలసి గ్రూప్ ఫోటో దిగారు. జిల్లాలో పార్టీ బలోపేతం, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఇరువురు కొద్దిసేపు చర్చించారు. శిబిరంలో పార్టీ సంస్థాగత నిర్మాణం, బూత్ స్థాయి బలోపేతం, ప్రజా సమస్యలపై సమర్థవంతమైన పోరాట విధానాలపై విస్తృతంగా చర్చలు జరిగాయి. పది రోజులపాటు నిర్వహించిన ఈ శిక్షణా కార్యక్రమం ఎంతో ఉపయోగకరంగా నిలిచిందని సుగుణక్క పేర్కొన్నారు. జిల్లాలో పార్టీని మరింత పటిష్టం చేసేందుకు శిబిరంలో నేర్చుకున్న మార్గదర్శకాలను అమలు చేస్తామని ఆమె తెలిపారు.

తాజావార్తలు