ఇరాన్ మౌళిక సదుపాయాలపై అమెరికా ఉక్కుపాదం

` దేశాన్నే ధ్వంసం చేస్తానని ప్రతిజ్ఞ
` ఇరాన్ రహస్య భూగర్భ అణు ప్రాజెక్ట్ ధ్వంసం
` తామే దాడి చేశామని ఇజ్రాయిల్ రక్షణ దళం ప్రకటన
` ఐదోరోజూ కొనసాగిన పరస్పర దాడులు
` ఇజ్రాయిల్ దాడులకు దీటుగా ఇరాన్ బాంబులు
` టెహ్రాన్ ప్రార్థనా మందిరంలో ఖమేనీ భౌలిక కాయం
` మూడ్రోజుల పాటు ప్రజల సందర్శనకు అనుమతి
టెహ్రాన్(జనంసాక్షి):ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులు మరింత తీవ్రతరం చేసింది. ఈ క్రమంలోనే ఇరాన్ రహస్య భూగర్భ అణుప్రాజెక్ట్ ను తమ దళాలు ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ రక్షణ దళం ప్రకటించింది. టెహ్రాన్ సరిహద్దుల్లోని మింజాదెహైలో రహస్యంగా ఏర్పాటుచేసిన న్యూక్లియర్ కేంద్రం కాంపౌండ్‌పై దాడి చేసినట్లు ఐడీఎఫ్ అధికార ప్రతినిధి డెఫ్రిన్ తెలిపారు. ఈ కేంద్రంలో శాస్త్రవేత్తలు రహస్యంగా పనిచేస్తున్నట్లు సమాచారం అందిందన్నారు. 2025లో అమెరికా దాడుల తర్వాత ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని ఇక్కడికి మళ్లించినట్లు పేర్కొన్నారు. గతేడాది జూన్‌లో తాము ఇరాన్‌పై ‘ఆపరేషన్ రైజింగ్ లయన’ పేరుతో 12 రోజుల పాటు దాడులు చేసిన విషయాన్ని డెఫ్రిన్ ప్రస్తావించారు. ఆ సమయంలో వాడిన మందుగుండు సామగ్రి కంటే ఎక్కువ పేలుడు పదార్థాలను ఈ నాలుగు రోజుల్లో ఇరాన్‌పై ప్రయోగించినట్లు తెలిపారు. గతంలో తాము ఇరాన్ అణుస్థావరాలను ధ్వంసం చేసినప్పటికీ ఆ దేశం అణు కార్యకలాపాలను ఆపకుండా.. అణ్వాయుధాలను అభివద్ధి చేస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. వాటిని టెహ్రాన్ శివార్లలోని రహస్య భూగర్భ స్థావరంలో భద్రపరిచిందని తమకు కచ్చితమైన సమాచారం రావడంతో ఆ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకున్నామన్నారు.ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో ఇరాన్‌కు చెందిన 300 క్షిపణి లాంచర్లు ధ్వంసమైనట్టు ఐడీఎఫ్ అధికార ప్రతినిధి వెల్లడించారు. ఆ దేశంలోని బాలిస్టిక్ క్షిపణి శ్రేణులు, వైమానిక రక్షణ వ్యవస్థలపై తమ వైమానిక దళాలు దాడులు కొనసాగిస్తున్నాయన్నారు. ఇజ్రాయెల్ చేపట్టిన తాజా దాడులకు సంబంధించిన దశ్యాలను ఐడీఎఫ్ సోషల్ విÖడియాలో షేర్ చేసింది.
ఇరాన్ రహస్య భూగర్భ అణు ప్రాజెక్ట్ ధ్వంసం
ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులు మరింత తీవ్రతరం చేసింది. ఈ క్రమంలోనే ఇరాన్ రహస్య భూగర్భ అణుప్రాజెక్టును తమ దళాలు ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ రక్షణ దళం ప్రకటించింది. టెహ్రాన్ సరిహద్దుల్లోని మింజాదెహైలో రహస్యంగా ఏర్పాటుచేసిన న్యూక్లియర్ కేంద్రం కాంపౌండ్‌పై దాడి చేసినట్లు ఐడీఎఫ్ అధికార ప్రతినిధి డెఫ్రిన్ తెలిపారు. ఈ కేంద్రంలో శాస్త్రవేత్తలు రహస్యంగా పనిచేస్తున్నట్లు సమాచారం అందిందన్నారు. 2025లో అమెరికా దాడుల తర్వాత ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని ఇక్కడికి మళ్లించినట్లు పేర్కొన్నారు. గతేడాది జూన్‌లో తాము ఇరాన్‌పై ’ఆపరేషన్ రైజింగ్ లయన’ పేరుతో 12 రోజుల పాటు దాడులు చేసిన విషయాన్ని డెఫ్రిన్ ప్రస్తావించారు. ఆ సమయంలో వాడిన మందుగుండు సామగ్రి కంటే ఎక్కువ పేలుడు పదార్థాలను ఈ నాలుగు రోజుల్లో ఇరాన్‌పై ప్రయోగించినట్లు తెలిపారు. గతంలో తాము ఇరాన్ అణుస్థావరాలను ధ్వంసం చేసినప్పటికీ ఆ దేశం అణు కార్యకలాపాలను ఆపకుండా.. అణ్వాయుధాలను అభివద్ధి చేస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. వాటిని టెహ్రాన్ శివార్లలోని రహస్య భూగర్భ స్థావరంలో భద్రపరిచిందని తమకు కచ్చితమైన సమాచారం రావడంతో ఆ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకున్నామన్నారు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో ఇరాన్‌కు చెందిన 300 క్షిపణి లాంచర్‌లను తాకాయని ఐడీఎఫ్ అధికార ప్రతినిధి వెల్లడించారు. ఆ దేశంలోని బాలిస్టిక్ క్షిపణి శ్రేణులు, వైమానిక రక్షణ వ్యవస్థలపై తమ వైమానిక దళాలు దాడులు కొనసాగిస్తున్నాయన్నారు. ఇజ్రాయెల్ చేపట్టిన తాజా దాడులకు సంబంధించిన దశ్యాలను ఐడీఎఫ్ సోషల్ విÖడియాలో షేర్ చేసింది.
ఐదోరోజూ పరస్పర దాడులు
ఇజ్రాయిల్ దాడులకు దీటుగా ఇరాన్ బాంబులు
ఇరాన్, అమెరికా`ఇజ్రాయెల్ సంయుక్త కూటమి మధ్య యుద్ధం ఐదోరోజైన బుధవారంనాడు మరింత తీవ్రమైంది. దీంతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇరాన్ క్షిపణి లాంచర్లు, ఆయుధ ఫ్యాక్టరీలను టార్గెట్ చేస్తూ ఇజ్రాయెల్ దాడులు జరుపుతోంది. ఇరాన్‌లోని ఉర్మియా, కెర్మాన్‌షా నగరాలకు కూడా దాడులను విస్తరించింది. తూర్పు టెహ్రాన్‌లో భారీ పేలుడు శబ్దాలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో ఇజ్రాయెల్‌తో సహా గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై డజన్ల కొద్దీ బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో ఇరాక్ దాడులు కొనసాగిస్తోంది. ఇరాన్ క్షిపణులు సౌదీలోని ఎంబసీని, దుబాయ్‌లోని యూఎస్ కాన్సలేట్‌ను ఢీకొట్టాయి. ఖతార్‌లోని అల్ ఉదేద్ ఎయిర్‌బేస్‌పై కూడా ఇరాన్ క్షిపణి దాడి జరిగింది. కెర్మాన్ సిటీ శివార్లలో ఇజ్రాయెల్‌కు చెందిన హెర్మేస్ డ్రోన్‌ను కూల్చేసినట్టు కెర్మాన్ ప్రావిన్స్‌లోని ఐఆర్‌జీసీ ప్రాంతీయ విభాగం తెలిపింది. గత 24 గంటల్లో మూడు హెర్మేస్ డ్రోన్‌లను కూల్చేసినట్టు ప్రకటించింది. మధ్యప్రాచ్యంలోని ఇరాక్ ’ఎర్బిల్ బేస’, కువైట్‌లోని అలీ అల్ సలేమ్ ఎయిర్‌బేస్, అరిఫ్‌జాన్ ఎయిర్ బేస్ సహా అమెరికా సైనిక స్థావరాలపై ఇంతవరకూ 230 డ్రోన్లు పేల్చినట్టు తెలిపింది. ఇజ్రాయెల్ గత శనివారంనాడు టెహ్రాన్‌పై దాడులు ప్రారంభించినప్పటి ఇంతవరకూ ఇరాన్‌లో 800 మంది వరకూ ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు చెబుతున్నారు. కాగా, ఐదు రోజుల్లో ఇరాన్‌లోని 1,700 లక్ష్యాలపై దాడులు చేసినట్టు యునైటెడ్ స్టేట్స్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. వీటిలో నావికాదళ నౌకలు, సబ్‌మెరీన్లు, యాంటీ షిప్ క్షిపణి వ్యవస్థలు, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లు కూడా ఉన్నాయని వెల్లడించింది. కాగా, ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అల్ ఖమేనీకి ప్రజలు బుధవారం రాత్రి నుంచి మూడు రోజులు నివాళులు అర్పించనున్నాయి. పేటికలో ఉంచిన ఆయన మతదేహాన్ని టెహ్రాన్‌లోని ప్రార్థనా మందిరంలో ఉంచనున్నారు.

 

2.ఇదేం దాష్టికం?(కిక్కర్)
ఇరాన్ కొత్త సుప్రీంనూ హతమారుస్తాం
` ‘సుప్రీం’ ఎవరైనా.. తమన టార్గెట్‌లోనే అంటూ అమెరికా,ఇజ్రాయెల్ వార్నింగ్
వాషింగ్టన్(జనంసాక్షి):అమెరికా` ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆయన వారసుడిగా ముజ్తబా హ్పస్సేనీ ఖమేనీ ఎన్నికైనట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలో ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఖమేనీ స్థానంలో ఎవరు వచ్చినా.. వాళ్లని లక్ష్యంగా చేసుకుంటామన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్టు పెట్టారు.ఇజ్రాయెల్‌ను నాశనం చేయాలనుకునేవారిని వదిలిపెట్టేది లేదని కట్జ్ పేర్కొన్నారు. అమెరికాతో సహా ప్రపంచంలోని దేశాలను బెదిరించడానికి, ఇరాన్ ప్రజలను అణచివేయడానికి ఆ దేశ ప్రభుత్వం నియమించిన ఏ నాయకుడినైనా నిస్సందేహంగా అంతం చేస్తామని హెచ్చరించారు. అతను ఎవరైనా.. ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టబోమన్నారు. ఇరాన్ పాలన సామర్థ్యాలను తుడిచిపెట్టేస్తామని వ్యాఖ్యానించారు. ఇందుకు అమెరికా భాగస్వామ్యంతో కలిసి పనిచేస్తూనే ఉంటామన్నారు. ఖమేనీ రెండో కుమారుడు ముజ్తబాను దేశ సుప్రీం నేతగా ఇరాన్ అసెంబ్లీలోని కీలక నేతలు ఎన్నుకున్నట్లు విÖడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ (ఐఆర్‌జీసీ)తో బలమైన సంబంధాలు ఉన్న ఆయన.. త్వరలోనే బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఈక్రమంలో ఇజ్రాయెల్ హెచ్చరికలు చేయడం గమనార్హం. ఇక, ఇరాక్, కువైట్‌లోని అమెరికా స్థావరాలను టార్గెట్ చేసినట్లు ఐఆర్‌జీసీ పేర్కొంది. ఈ క్రమంలో 40 క్షిపణులు, 230 డ్రోన్లను ప్రయోగించినట్లు తెలిపింది. మరోవైపు.. అమెరికా` ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల్లో ఇరాన్‌లో 1,097 మంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికాకు చెందిన హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్స్ న్యూస్ ఏజెన్సీ ఈ విషయాన్ని వెల్లడించింది.

 

3.శ్రీలంక తీరంలో ఇరాన్ యుద్ధనౌక మునక..
` 100 మందికిపైగా గల్లంతు
కొలంబో(జనంసాక్షి):పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. శ్రీలంక తీరంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. తమ దేశ దక్షిణ తీరంలో మునిగిపోతున్న ఓ ఇరాన్ యుద్ధ నౌక నుంచి 32 మందిని రక్షించి, ఆసుపత్రిలో చేర్చినట్లు శ్రీలంకకు చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని, ఏడుగురికి అత్యవసర చికిత్స అందిస్తున్నామని వెల్లడించారు.“గాలె తీరానికి 40 నాటికల్ మైళ్ల దూరంలో ‘ఐఆరఐఎస్ దేనా’ అనే ఇరాన్ యుద్ధ నౌక ప్రమాదంలో ఉన్నట్లు శ్రీలంక నౌకాదళానికి సమాచారం అందింది. వెంటనే సహాయక చర్యల కోసం నౌకలు, ఎయిర్‌ఫోర్స్ విమానాలను పంపాం. ఈ నౌకలో 180 మంది ఉన్నట్లు సమాచారం. వారిలో దాదాపు 30 మందిని రక్షించాం” అని విదేశాంగ మంత్రి విజిత హెరాత్ పార్లమెంటుకు తెలిపారు.
హర్మూజ్‌లో చమురు నౌకలకు.. అమెరికా నేవీ రక్షణ: ట్రంప్ హావిÖ
ఇజ్రాయెల్, అమెరికా దాడులు.. ఇరాన్ ప్రతిదాడులతో పశ్చిమాసియా అట్టుడుకున్న వేళ ఈ ఘటన ప్రాధాన్యం సంతరించుకుంది. నౌక ఎలా దెబ్బతింది? సిబ్బంది ఎలా గాయపడ్డారు? అనే వివరాలు తెలియరాలేదు. అయితే, ఈ నౌకపై జలాంతర్గామి దాడి జరిగిందని, 100 మందికిపైగా గల్లంతయ్యారని, 78 మంది గాయపడ్డారని అంతర్జాతీయ కథనాలు వెల్లడించాయి. ‘ఐఆరఐఎస్ దేనా’.. ఇరాన్ కొత్త యుద్ధ నౌకల్లో ఒకటి. ప్రస్తుతం అమెరికా ఆంక్షల జాబితాలో ఉంది. ఇటీవల విశాఖ తీరంలో నిర్వహించిన విన్యాసాల్లో పాల్గొని, తిరుగు ప్రయాణంలో ఉండగా ఈ ఘటన జరిగినట్లు సమాచారం.

మేమే ముంచేశాం
` మా సబ్‌మైరైన్ల ద్వారా పేల్చేశాం
` ఇరాన్ యుద్ధనౌకను ధ్వంసం చేసినట్లు ప్రకటించిన అమెరికా
వాషింగ్టన్(జనంసాక్షి):శ్రీలంక తీరంలో ఇరాన్ యుద్ధ నౌక ‘ఐఆరఐఎస్ దేనా’ను తామే ముంచేశామని అమెరికా ప్రకటించింది. హిందూ మహాసముద్రంలో ఆ నౌకపై జలాంతర్గామి టార్పిడోలతో దాడి చేసినట్లు అమెరికా రక్షణశాఖ మంత్రి పీట్ హెగ్సెత్ ధ్రువీకరించారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత శత్రుదేశంపై ఈ తరహా దాడి ఇదే మొదటిదని తెలిపారు. పెంటగాన్‌లో ఆయన విÖడియాతో మాట్లాడారు.ఇజ్రాయెల్‌తో కలిసి ఇరాన్‌పై దాడులను ఇప్పుడిప్పుడే ప్రారంభించామని, త్వరలో మరిన్ని దాడులు జరగబోతున్నాయని చెప్పారు. తమ వద్ద అపరిమిత సంఖ్యలో గ్రావిటీ బాంబులు ఉన్నాయని, వాటిని ఉపయోగిస్తామన్నారు. కొన్ని రోజుల్లోనే ఇరాన్ గగనతలాన్ని పూర్తిగా తమ నియంత్రణలోకి తీసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఇరాన్ (ఎతీజీని) అణు కార్యక్రమాలను నాశనం చేయడంపైనే తమ దష్టి ఉందని చెప్పారు.తమ దేశ తీరంలో ఓ ఇరాన్ యుద్ధ నౌక మునిగిపోతున్నట్లు శ్రీలంక ప్రకటించిన విషయం తెలిసిందే. అందులోని 32 మందిని రక్షించి.. ఆస్పత్రిలో చేర్చినట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఆ నౌకలో 180 మంది ఉన్నట్లు సమాచారం ఉందని చెప్పారు. మరోవైపు.. ఘటనాస్థలంలో అనేక మతదేహాలు లభ్యమయ్యాయని శ్రీలంక నౌకాదళ ప్రతినిధి విÖడియాకు చెప్పారు. కచ్చితమైన సంఖ్య ఇప్పుడే వెల్లడించలేమన్నారు. ఈ ఘటనలో ఇప్పటివరకు 80 మంది మతి చెందినట్లు అంతర్జాతీయ విÖడియా కథనాలు వెల్లడించాయి.