తెలంగాణ కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులుగా వేం నరేందర్‌రెడ్డి, అభిషేక్ మను సింఘ్వి

` ఖరారు చేసిన పార్టీ అధిష్టానం
హైదరాబాద్: తెలంగాణ నుంచి కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారయ్యారు. వేం నరేందర్‌రెడ్డి, అభిషేక్ మను సింఘ్వి పేర్లను అధిష్ఠానం ఖరారు చేసింది. గురువారం వీరు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. మాజీ ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి, మాజీ ఎంపీ వీహెచ్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, వినయ్‌కుమార్, జెట్టి కుసుమకుమార్ తదితరుల పేర్లూ వినిపించినప్పటికీ.. సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి పేరు ఖరారైంది.మహబూబాబాద్ జిల్లాకు చెందిన వేం నరేందర్‌రెడ్డి.. సీఎం రేవంత్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరుపొందారు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబాబాద్ నుంచి తెదేపా తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2012లో జరిగిన ఉప ఎన్నికలో హనుమకొండ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2015లో ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం చెందారు. అనంతరం రేవంత్‌రెడ్డితో పాటు వేం నరేందర్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు.