ఇరాన్ నాయకత్వ నివాసాలే లక్ష్యంగా ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’

` ఆయుధ నిల్వలపై దాడి
` సుప్రీం లీడర్ ప్రతి కదలికను ట్రాక్ చేసి..
` పక్కా సమాచారంతోనే అటాక్ ప్లాన్
` కొన్ని నెలలుగా ట్రాఫిక్ కెమెరాలు ట్రాక్ చేసి.. ఫోన్ నెట్‌వర్క్‌పై నిఘా పెట్టిన ఇజ్రాయెల్
` ఇరాన్ అధ్యక్ష కార్యాలయంపై దాడి చేశాం: ఐడీఎఫ్
న్యూయార్,టెహ్రాన్(జనంసాక్షి):అమెరికా`ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీంలీడర్ ఖమేనీ మతి చెందడం సంచలనం సష్టించింది. కొన్నేళ్లక్రితమే సుప్రీంలీడర్‌ను తమ టార్గెట్‌లో పెట్టుకొన్న ఇజ్రాయెల్.. ఆయన కదలికలను పసిగట్టేందుకు ఇరాన్ ట్రాఫిక్ కెమెరా నెట్‌వర్క్, మొబైల్ ఫోన్ సిస్టమ్స్‌ను హ్యాక్ చేసిందని అంతర్జాతీయ విÖడియా కథనాలు వెల్లడించాయి. రాజధాని నగరం టెహ్రాన్‌లోని అన్ని ట్రాఫిక్ కెమెరాలు ఏళ్లపాటు హ్యాకింగ్‌కు గురయ్యాయని ఇజ్రాయెల్ నిఘా విభాగంలో పనిచేసిన అధికారులు వెల్లడించారు. ఆ ఫుటేజీని ఎప్పటికప్పుడు ఎన్‌క్రిప్ట్ చేసి, స్వదేశానికి తెప్పించుకున్నట్లు పేర్కొన్నారు. టెహ్రాన్‌లో సుప్రీంలీడర్ కాంపౌండ్‌లో రోజూవారీ కార్యకలాపాలు, ఆయన భద్రతా సిబ్బంది వాహనాల పార్కింగ్ గురించి ఎప్పటికప్పుడు నెతన్యాహు ప్రభుత్వం పర్యవేక్షించేదని విÖడియా కథనాలు పేర్కొన్నాయి. “ఖమేనీ ఎక్కడ ఉంటారు..? ఎవరిని కలుస్తున్నారు..? ఇతరులతో ఎలా కమ్యూనికేట్ అవుతారు..? తన ప్రాణానికి ఏదైనా హాని ఉంటే ఎక్కడికి వెళ్తారు..?” ఇలా ప్రతి విషయాన్ని యూఎస్, ఇజ్రాయెల్ (ఎబతీజీవశ్రీ) నిఘా వర్గాలు సునిశితంగా అధ్యయనం చేశాయని వెల్లడించాయి. ఆయనతో సమావేశమయ్యే రాజకీయ, మిలిటరీ ఉన్నతాధికారుల్ని కూడా ట్రాక్ చేసినట్లు తెలుస్తోంది.“మాకు జెరూసలెం గురించి ఎంత తెలుసో.. టెహ్రాన్ గురించి కూడా అంతే బాగా తెలుసు” అని ఆ వర్గాలు పేర్కొనడం గమనార్హం. ఎప్పటికప్పుడు సేకరించిన సమాచారాన్ని ఒక క్రమంలోకి తీసుకువచ్చేందుకు ఇజ్రాయెల్ ఏఐ టూల్స్, అల్గారిథమ్స్‌ను ఉపయోగించిందట. ఇక, ఈ ఫిబ్రవరి 28న కూడా అత్యంత కచ్చితత్వంతో ఖమేనీని టార్గెట్ చేయడానికి ఈ డేటానే ఉపయోగపడింది.ఇరాన్‌లో ప్రతి శుక్రవారం ప్రభుత్వ సెలవుదినం. ఖమేనీ ప్రతీ వారం ప్రారంభం రోజున (శనివారం) తన అధికారిక నివాసంలో కీలక ప్రభుత్వ పెద్దలు, సైనిక ఉన్నతాధికారులతో సవిÖక్షా సమావేశాలు నిర్వహించేవారు. టెహ్రాన్ నగర నడిబొడ్డులోని ఒక ప్రభుత్వ ప్రాంగణంలో ఇరాన్ అత్యున్నత స్థాయి అధికారుల సమావేశం ఉంటుందని ఇజ్రాయెల్ తెలుసుకొని దాడి చేసింది. ఈ వ్యవహారంలో అమెరికా నిఘా సంస్థ సీఐఏ ఇచ్చిన సమాచారం కూడా కీలకమైంది.
ఏకకాలంలో సైబర్ దాడులు కూడా..
ఇదిలాఉంటే.. శనివారం ఇజ్రాయెల్`యూఎసఏ చేపట్టిన సంయుక్త ఆపరేషన్‌లో ఇరాన్‌పై సైబర్ దాడులు కూడా జరిగాయని జెరూసలెం పోస్ట్ వెల్లడించింది. అత్యంత కీలకమైన మౌలిక సదుపాయాలతో పాటు సెక్యూరిటీ కమ్యూనికేషన్ సిస్టమ్స్, అధికారిక విÖడియా సంస్థల సైట్లు హ్యాక్ అయ్యాయి. దాంతో ఇంటర్నెట్ కనెక్టివిటీ పడిపోయిందని ఆ విÖడియా కథనం పేర్కొంది. ఇరాన్ ప్రతిదాడుల సామర్థ్యాన్ని దెబ్బతీసేందుకే ఈ సైబర్ అటాక్ చేసినట్లు తెలుస్తోంది.
ఇరాన్ అధ్యక్ష కార్యాలయంపై దాడి చేశాం: ఐడీఎఫ్
ఇరాన్‌పై ఇజ్రాయెల్ తన దాడులను తీవ్రతరం చేసింది. ఈ క్రమంలోనే ఇరాన్ అధ్యక్ష కార్యాలయంపై దాడి చేసినట్లు ప్రకటించింది. “కచ్చితమైన నిఘా సమాచారం ఆధారంగా.. టెహ్రాన్ నడిబొడ్డున ఉన్న కీలక ప్రాంగణంపై దాడులు చేశాం. అధ్యక్ష కార్యాలయం, సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ భవనంపై అనేక బాంబులు జారవిడిచాం. అదేవిధంగా ఇరాన్ సైనికాధికారులకు శిక్షణ ఇచ్చే సంస్థను, ఇతర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకున్నాం” అని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ తెలిపింది.మరోవైపు.. యుద్ధంపై ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ నాదవ్ శోషాని కీలక వ్యాఖ్యలు చేశారు. దాడులు అనేక వారాల పాటు కొనసాగవచ్చనే అంచనాతో తమ సైన్యం సిద్ధమైందని చెప్పారు. అయితే, యుద్ధం ఎంత కాలం కొనసాగుతుందనేది పరిస్థితులపై ఆధారపడి ఉంటుందన్నారు. ఇప్పటివరకు యుద్ధంలో సానుకూల పురోగతి సాధించామని ఓ విÖడియా సమావేశంలో తెలిపారు. ఇరాన్‌లో భూతల దాడుల కోసం బలగాలను మోహరించే అవకాశం ఉందా? అనే ప్రశ్నపై స్పందిస్తూ.. అలాంటిదేవిÖ లేదని చెప్పారు. ఇప్పటికైతే అటువంటి ఆలోచనలు లేవన్నారు.

 

ప్రతీకారంతో రగిలిపోతున్న ఇరాన్
` అమెరికా, ఇజ్రాయెల్ లక్ష్యంగా విరుచుకుపడుతున్న ఐఆర్‌జీసీ
` బహ్రెయిన్‌లోని అమెరికా ఎయిర్‌బేస్‌ను ధ్వంసం
` హర్ముజ్ జలసంధి మూసివేత..
` ఏ దేశ నౌకలైనా వస్తే పేల్చేస్తామని హెచ్చరిక
` ఇరాన్ వార్నింగ్‌తో చమురు సంక్షోభం
` పశ్చిమాసియా ఘర్షణల్లో ముగ్గురు భారతీయులు మతి
` భారతీయ విద్యార్థులు సురక్షిత ప్రాంతాలకు తరలింపు
` అమెజాన్ డేటా సెంటర్‌లపై డ్రోన్ దాడి..
టెహ్రాన్(జనంసాక్షి):పశ్చిమాసియాలో తాజా ఘర్షణలు నాలుగో రోజుకు చేరాయి. ఇజ్రాయెల్`అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం కొనసాగుతోంది బహ్రెయిన్‌లోని షేక్ ఇసా ప్రాంతంలోని అమెరికా ఎయిర్‌బెస్‌ను ధ్వంసం చేశామని మంగళవారం ఇరాన్ ప్రకటించుకుంది. డ్రోన్లు, క్షిపణులతో కమాండ్ సెంటర్, కేంద్ర కార్యాలయాన్ని దెబ్బతీశామని వెల్లడించింది. “20 డ్రోన్లు, మూడు క్షిపణులతో టార్గెట్లను ఢీకొట్టాం. దాంతో ఆ ప్రాంతంలో ఇంధనాన్ని నిల్వ చేసే ట్యాంకులకు మంటలు అంటుకొని ఆ ప్రాంతమంతా పొగ అలముకుంది” అని ఇరాన్ వెల్లడించింది. మరోవైపు ఇజ్రాయెల్‌లోని రమాత్ డేవిడ్ ఎయిర్‌బేస్‌పై దాడి జరిగినట్లు హెజ్‌బొల్లా ప్రకటించింది. రాడార్ కేంద్రాలు, కంట్రోల్ రూమ్‌లను లక్ష్యంగా చేసుకున్నట్లు వెల్లడించింది. అందుకోసం డ్రోన్ల గుంపును పంపినట్లు పేర్కొంది. ఇదిలాఉంటే.. బీరుట్ దక్షిణ ప్రాంతాల్లోని ప్రజలు వెంటనే ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ (ఎబతీజీవశ్రీ) హెచ్చరికలు చేసింది. “ఎరుపు రంగు మార్కింగ్‌లో ఉన్న భవనాలు, ఆ పక్కనే ఉన్న ఇళ్లను తక్షణమే ఖాళీ చేయాలి. కనీసం 300 విÖటర్లు దూరంగా వెళ్లండి. ఆ భవనాలన్నీ హెజ్‌బొల్లా స్థావరాలకు దగ్గర్లో ఉన్నాయి” అని ఇజ్రాయెల్ పేర్కొంది.
పశ్చిమాసియా ఘర్షణలు.. ముగ్గురు భారతీయులు మతి
పశ్చిమాసియా ఘర్షణల్లో ఇప్పటివరకు భారతదేశానికి చెందిన ముగ్గురు నావికులు మతి చెందినట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ వెల్లడించింది. ఒమన్ తీర ప్రాంతాల్లో ఉన్న పలు వాణిజ్య నౌకలపై ఇరాన్ చేసిన దాడు ల్లో ముగ్గురు భారతీయులు మతిచెందగా మరొకరు తీవ్రంగా గాయపడినట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో షిప్ ఆపరేటర్లకు అడ్వైజరీ జారీ చేసింది. గల్ఫ్ ఆఫ్ ఒమన్ హోర్ముజ్ జలసంధి, పర్షియన్ గల్ఫ్‌లో పరిస్థితులను గమనిస్తున్నామని పేర్కొంది. ఆయా ప్రాంతాల్లో క్షిపణి, డ్రోన్ కార్యకలాపాలకు సమస్యలు ఉన్నట్లు గుర్తించామని తెలిపింది. షిప్ ఆపరేటర్ల భద్రతను కచ్చితంగా దష్టిలోఉంచుకోవాలని.. అనుమానాస్పద కార్యకలాపాలపై వెంటనే రిపోర్టు చేయాలని సూచించింది. తాజా నివేదికల ప్రకారం.. భారత జెండా ఉన్న నౌకలను బంధించినట్లు ఎటువంటి సమాచారం రాలేదని షిప్పింగ్ డైరెక్టర్ జనరల్ శ్యామ్ జగన్నాథన్ పేర్కొన్నారు. ఇప్పటివరకు రక్షించిన సిబ్బందిని స్వదేశానికి రప్పించడానికి ఒమన్‌లోని భారత రాయబార కార్యాలయం చర్యలు తీసుకుంటుందన్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్నందున పర్షియన్ గల్ఫ్ సవిÖపంలో చిక్కుకొన్న భారతీయ నావికులకు తక్షణ సాయం అందించడానికి.. వారిని భారత్‌కు తరలించడానికి ప్రత్యేక ప్రతిస్పందన బందాన్ని ఏర్పాటుచేసినట్లు తెలిపారు. యుద్ధం వల్ల ప్రభావితులైన భారత నావికులతో ఈ బందంలోని అధికారులు నిరంతరం సంప్రదింపులు జరుపుతారన్నారు. నావికుల కుటుంబాలు, షిప్పింగ్ కంపెనీలు, ట్రేడ్ యూనియన్లు, విదేశాలలో ఉన్న భారతీయ మిషన్లు, సంబంధిత పోర్ట్ అధికారులతోనూ ఈ బందం సమన్వయం చేసుకుంటుందన్నారు. ఇదీ చదవండి: హోర్ముజ్‌ను మూసేశాం.. నౌకలు వచ్చాయో: ఇరాన్ వార్నింగ్
టెహ్రాన్‌పై దాడులు.. భారతీయ విద్యార్థులు సురక్షిత ప్రాంతాలకు తరలింపు
ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పై ఇజ్రాయెల్ పెద్దఎత్తున దాడులు చేస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో అక్కడున్న భారతీయ విద్యార్థుల క్షేమాన్ని దష్టిలో ఉంచుకుని స్థానిక రాయబార కార్యాలయం కీలక చర్యలు తీసుకుంది. అనేక మంది విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు వెల్లడించింది. ఈమేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.“టెహ్రాన్‌పై దాడులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో.. నగరంలోని అనేక మంది భారతీయ విద్యార్థులను సురక్షిత ప్రదేశాలకు తరలించాం. విద్యార్థుల రవాణా, ఆహారం, వసతి ఏర్పాట్లను చూసుకున్నాం. ఎంబసీ సాయాన్ని నిరాకరించిన కొంతమంది మాత్రమే ప్రస్తుతం టెహ్రాన్‌లో ఉన్నారు.ఇంకా ఇరాన్‌లోనే ఉన్న భారతీయ విద్యార్థులు, పౌరులు.. ఇదివరకే జారీ చేసిన సలహాలు పాటించాలి. ప్రస్తుతం ఉన్న ప్రాంతంలోనే ఇళ్లకే పరిమితం కావాలి. వీలైనంత వరకు కిటికీలకు దూరంగా ఉండండి. ఎల్లవేళలా అప్రమత్తంగా వ్యవహరించండి. నిరసనలు, ప్రదర్శనలు జరుగుతున్న ప్రాంతాలకు వెళ్లొద్దు. భారత రాయబార కార్యాలయంతో టచ్‌లో ఉండండి” అని టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం పేర్కొంది.
మా డేటా సెంటర్‌లపై డ్రోన్ దాడి నిజమే: అమెజాన్
అమెరికా` ఇజ్రాయెల్ సైనిక చర్యలకు ప్రతీకారంగా పశ్చిమాసియా దేశాలపై ఇరాన్ దాడులు చేస్తోంది. ఈ క్రమంలో అక్కడి అమెజాన్ డేటా సెంటర్‌లపై దాడులు జరిగినట్లు వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ దాడులు నిజమేనని అమెజాన్ వెబ్ సర్వీసెస్ ధ్రువీకరించింది.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని తమ రెండు డేటా సెంటర్లను డ్రోన్‌లు దాడి చేశాయని అమెజాన్ పేర్కొంది. దీంతో పశ్చిమాసియాలోని కొన్ని ప్రాంతాల్లో క్లౌడ్ సర్వీసుల్లో అంతరాయం కలిగినట్లు తెలిపింది. బహ్రెయిన్‌లోని డేటా సెంటర్ సవిÖపంలో జరిగిన దాడి వల్ల మౌలిక సదుపాయాలకు నష్టం వాటిల్లినట్లు వెల్లడించింది. ఈ దాడుల్లో ఉద్యోగులు ఎవరైనా గాయపడ్డారా? లేదా? అనే విషయం గురించి సంస్థ స్పష్టం చేయలేదు. సర్వీసుల పునరుద్ధరణకు తమ సిబ్బంది స్థానిక అధికారులతో కలిసి పనిచేస్తున్నట్లు చెప్పింది. సర్వీసుల్లో అంతరాయం కారణంగా ప్రభావితమైన వినియోగదారులు కీలకమైన డేటాను బ్యాకప్ చేసుకొని.. ఇతర ప్రాంతాల్లోని అమెజాన్ సర్వీసులకు మారాలని సూచించింది.
హర్ముజ్ జలసంధి మూసివేత
పశ్చిమాసియాలో ఘర్షణ వాతావరణం రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. ఇప్పటికే ముడిచమురు ధరలు పెరుగుతుండగా.. ఇరాన్ ఇచ్చిన వార్నింగ్ మరింత ఆందోళనకు దారితీస్తోంది. హోర్ముజ్ జలసంధి ని మూసివేశామని, నౌకలు దానిని దాటడానికి ప్రయత్నిస్తే నిప్ప్పు పెడతామని హెచ్చరించింది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్, నౌకాదళ సిబ్బంది ఆ పని చేస్తారని ఇరాన్ హెచ్చరించింది. హార్ముజ్ జలసంధిని మూసివేశామని, ఆ జలసంధి గుండా వెళ్లేందుకు ప్రయత్నించే ఏ నౌకపైనైనా కాల్పులు జరుపుతామని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కమాండర్ ఇన్ చీఫ్ సీనియర్ సలహాదారు ఇబ్రహీం జబారీ ప్రకటించారు. నౌకలు ఈ జలసంధిని దాటడానికి ప్రయత్నిస్తే దాడి చేస్తామని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ పేర్కొన్నట్లు అధికారిక విÖడియా వెల్లడించింది. ప్రపంచ ఆయిల్ రవాణాలో ఐదవ వంతు ఈ జలసంధి ద్వారానే సరఫరా అవుతుంది. దీంతో ఈ చర్య చమురు ధరలు పెరిగే అవకాశం ఉందని కెప్లర్ గణాంకాలు హెచ్చరించిన సంగతి తెలిసిందే. హోర్ముజ్.. ప్రపంచ ఇంధనానికి జీవనాడి వంటిది. కేవలం కొన్ని కిలోవిÖటర్ల వెడల్పు ఉన్న ఈ ప్రదేశం నుంచి ప్రపంచం వాడే చమురులో ఐదోవంతు రవాణా అవుతోంది. ఈ జలసంధిలో ఏర్పడే ఏ అంతరాయం అయినా ప్రపంచ వాణిజ్యాన్ని గజగజ లాడిస్తుంది. ఈ మార్గం నుంచి వచ్చే చమురు, ఎలఎన్‌జీ అత్యధికంగా భారత్, చైనా, దక్షిణ కొరియా, జపాన్ దేశాలకు ఎగుమతి అవుతోంది. ఇంతటి కీలకమైన జలసంధి మూసుకుపోతే.. రవాణా, బీమా ఖర్చులు గణనీయంగా పెరుగుతాయి. ఇప్పటికే ఆ ప్రభావం కనిపిస్తోంది. చమురు ధరలు భగ్గుమంటు న్నాయి. కాగా.. అమెరికా`ఇజ్రాయెల్ దాడుల్లో తమ సుప్రీంనేత ఖమేనీ మతి చెందడంతో ఇరాన్ రగిలిపోతోంది. ఈ నేపథ్యంలోనే హోర్ముజ్‌ను మూసివేసినట్లు ప్రకటించింది. డేటా అండ్ అనలిటిక్స్ సంస్థ కెప్లర్ గణాంకాల ప్రకారం.. సుమారు 150 ఆయిల్ ట్యాంకర్లు ఇప్పటికే ఈ హోర్ముజ్ నుంచి వెళ్లేందుకు ఎదురుచూస్తున్నాయి. మరోవైపు హోర్ముజ్ తూర్పువైపున 60 ట్యాంకర్లు వేచిచూస్తున్నాయి. ఇదిలాఉంటే, ఫిబ్రవరి మధ్యలో సైనిక విన్యాసాల కోసం జలసంధిలో కొంతభాగాన్ని ఇరాన్ మూసివేయగా.. అప్ప్పుడు చమురు ధరలు 6 శాతం మేర పెరిగాయి.

 

2. ఇరాన్‌తో చర్చలు లేవు
` ఇప్పటికే ఆలస్యమైంది
` ఇరాన్‌పై భీకర దాడులు తప్పవు
` మా వద్ద భారీ ఆయుధ నిల్వలున్నాయి
` వాటితో విజయవంతంగా ఎప్పటికీ యుద్ధం చేస్తూనే ఉండగలం
` లెక్కలేనన్ని ఆయుధాలు: ట్రంప్ పోస్ట్
వాషింగ్టన్(జనంసాక్షి):ఇరాన్‌పై యుద్ధం కొనసాగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. చర్చలకు సిద్ధమని ఇరాన్ నేతలు చెప్పారని.. అయితే, ఇప్పటికే ఆలస్యమైందని చెప్పినట్టు పేర్కొన్నారు. ఇరాన్ నాయకత్వంతోపాటు ఆ దేశ గగనతల రక్షణ, వాయుసేన, నౌకాదళ వ్యవస్థలన్నీ తుడిచిపెట్టుకుపోయినట్టు తెలిపారు. ఈ మేరకు సొంత సోషల్ విÖడియా వేదిక ట్రూత్ సోషల్‌లో పోస్టు చేశారు.వాల్స్టీట్ జర్నల్‌లో వచ్చిన ఓ కథనాన్ని ట్రంప్ ఖండించారు. ఆ పత్రిక అభిప్రాయంతో ఏకీభవించడం లేదన్నారు. అమెరికా ఆయుధ నిల్వలు తక్కువగా ఉన్నాయని, ఎక్కువ కాలం యుద్ధం కొనసాగితే అవి నిండుకునే ప్రమాదం ఉందన్న వార్తలను అధ్యక్షుడు తోసిపుచ్చారు. మధ్యస్థ, ఉన్నతస్థాయి ఆయుధాలు అపరిమిత సంఖ్యలో ఉన్నాయని, అవి చాలా శక్తిమంతమైనవన్నారు.
మా వద్ద లెక్కలేనన్ని ఆయుధాలు: ట్రంప్ పోస్ట్
ఇరాన్‌తో ఘర్షణల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ విÖడియా వేదికగా స్పందించారు. తమవద్ద లెక్కలేనన్ని ఆయుధాలు ఉన్నాయని పోస్టు పెట్టారు. విజయవంతంగా ఎప్పటికీ యుద్ధం చేస్తూనే ఉండగలమని రాసుకొచ్చారు. అమెరికా కోసం ఉన్నతశ్రేణి ఆయుధాలను ఇతర దేశాల్లో కూడా నిల్వ చేసినట్లు చెప్పారు. ఈ సందర్భంగా మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌పై విమర్శలు గుప్పించారు. ఆయన ఆయుధాల నిల్వలను సరిగా నిర్వహించలేదని, ఉక్రెయిన్‌కు భారీఎత్తున అధునాతన ఆయుధాలను పంపారని విమర్శించారు. “అదష్టవశాత్తూ నా తొలివిడత పాలనలోనే మిలిటరీని మెరుగుపర్చాను. అమెరికా వద్ద నిల్వలు భారీ విజయాలు సాధించేంతగా ఉన్నాయి” అని తన పోస్టులో పేర్కొన్నారు. ఇదిలాఉంటే.. ఇరాన్‌పై దాడుల గురించి కాంగ్రెస్ (అమెరికా చట్టసభలు)కు ట్రంప్ అధికారికంగా వెల్లడించారని స్థానిక విÖడియా కథనాలు వెల్లడించాయి (ఙS ఎబతీజీవశ్రీ చిజీతీ Oని ఎతీజీని). దేశ ప్రజల ప్రయోజనాల కోసమే ఈ చర్యలు తీసుకున్నట్లు అధ్యక్షుడు సమర్థించుకున్నారు. అలాగే రానున్న 24 గంటల్లో ఇరాన్‌పై భీకర దాడులు చేయనున్నట్లు ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. తాము ఇప్పటివరకు పెద్ద దాడులే చేయలేదని వ్యాఖ్యలు చేయడం ఆందోళన రేకెత్తిస్తోంది.
రానున్న 24 గంటల్లో ఇరాన్‌పై భీకర దాడులు..!
ఇరాన్‌పై యుద్ధాన్ని తీవ్రతరం చేసేందుకు అమెరికా సిద్ధమైంది. రానున్న 24 గంటల్లో ఆ దేశంపై భీకర దాడులు చేయనున్నట్లు అమెరికా అధికారులు పేర్కొన్నారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆందోళన రేకెత్తిస్తోంది. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. ఇరాన్‌పై తాము ఇప్పటివరకు పెద్ద దాడులే చేయలేదని వ్యాఖ్యానించారు. త్వరలోనే భీకర దాడులు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. ‘మేము ఇరాన్‌లోని చెత్తను తొలగిస్తాం. మా వద్ద ప్రపంచంలోనే గొప్ప సైన్యం ఉంది. మేము దాన్ని ఉపయోగిస్తున్నాం’ అని ట్రంప్ అన్నారు. యుద్ధం ఎక్కువ కాలం జరగాలని తాను కోరుకోవడం లేదని అధ్యక్షుడు పేర్కొన్నారు. అనుకున్న దానికంటే ముందుగానే తమ లక్ష్యాలను సాధిస్తున్నట్లు వెల్లడించారు.అరబ్ దేశాలపై ఇరాన్ దాడులకు దిగడం ఆశ్చర్యకరమైన విషయమన్నారు. వారు తీవ్రస్థాయిలో ఇరాన్‌తో పోరాడాలని అనుకుంటున్నట్లు వెల్లడించారు. ఇరాన్ నాయకత్వ బాధ్యతలను ఎవరు తీసుకుంటారనే విషయం తనకు తెలియదన్నారు. తాము జరిపిన తొలి దాడుల్లోనే అక్కడి కీలక వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారన్నారు. యురేనియం శుద్ధిని ఆపేందుకు ఆ దేశం సిద్ధంగా లేదని.. వారిని అడ్డుకునేందుకు సైనిక చర్యే సరైన మార్గం అని వ్యాఖ్యానించారు. తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా విదేశాంగశాఖ కీలక ప్రకటన చేసింది. సౌదీ అరేబియా, యూఏఈ సహా పశ్చిమాసియాలో ఉంటున్న అమెరికా పౌరులు ఆయా ప్రాంతాలను వీడాలని పేర్కొంది. భద్రతా ప్రమాణాల కారణంగా అమెరికన్లు అందుబాటులో ఉన్న రవాణా సౌకర్యాలను ఉపయోగించుకొని అక్కడినుంచి తరలిపోవాలని తెలిపింది.

అమెరికా ` ఇజ్రాయెల్ దాడులను ఖండించిన చైనా
` ఈ దాడులు అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకం
` భద్రతా మండలి అత్యవసర ప్రాతిపదికన సమావేశం కావాలి
` ప్రకటన విడుదల చేసిన చైనా విదేశాంగ శాఖ
బీజింగ్ (జనంసాక్షి)ఇరాన్‌పై అమెరికా`ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను చైనా ఖండించింది. తక్షణం కాల్పుల విరమణ ప్రకటించాలని సూచించింది. లేనిపక్షంలో ఈ ఘర్షణలు ఇతర దేశాలకు విస్తరించే ప్రమాదం ఉందని హెచ్చరించింది. గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ దాడులు చేస్తున్న నేపథ్యంలో చైనా విదేశాంగ శాఖ ఈ ప్రకటనను విడుదల చేసింది. అన్ని సైనిక చర్యలకూ ముగింపు చెప్పడం తక్షణ అవసరమని వ్యాఖ్యానించింది. చర్చల ద్వారా వివాదాలను పరిష్కరించుకోవాలని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి సూచించారు. అమెరికా నేతత్వంలో జరుగుతున్న దాడులు అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకమని కూడా చైనా కామెంట్ చేసింది. ఈ దాడులకు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అనుమతి లేదని పేర్కొంది. ఉద్రిక్తతలు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో భద్రతా మండలి అత్యవసర ప్రాతిపదికన సమావేశం కావాలని చైనా సూచించింది. గల్ఫ్ దేశాల సార్వభౌమత్వం, భద్రత, ప్రాదేశిక సమగ్రతను గౌరవించాలని స్పష్టం చేసింది. రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ లావ్రోవ్‌తో చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ ఈ విషయమైన ఫోన్‌లో మాట్లాడారు. శాంతి నెలకొల్పే దిశగా ప్రయత్నాలు జరగాలని చెప్పారు. త్వరలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఇరు దేశాలు నిరంతరం టచ్‌లో ఉన్నాయని కూడా విదేశాంగ శాఖ ప్రతినిధి తెలిపారు. ఇక ఇరాన్‌లో చిక్కుకున్న చైనీయులను స్వదేశానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని కూడా చైనా ప్రభుత్వం తెలిపింది. ఇప్పటికే 3 వేల మంది చైనీయులను స్వదేశానికి తీసుకొచ్చామని పేర్కొంది.

ఒమన్, కువైట్, ఖతార్‌లపై దాడులను ఖండించిన మోదీ
` ఆయా దేశాధినేతలకు ప్రధాని ఫోన్
న్యూఢిల్లీ(జనంసాక్షి):ఇజ్రాయెల్, అమెరికా దాడులు.. ఇరాన్ ప్రతిదాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘర్షణల్లో ఇప్పటివరకు భారత్‌కు చెందిన ముగ్గురు మతి చెందారు. ఈ పరిణామాల నడుమ ఒమన్, కువైట్, ఖతార్ పాలకులతో ప్రధాని మోదీ ఫోన్‌లో మాట్లాడారు. ఆయా దేశాలపై జరుగుతున్న దాడులపై ఆందోళన వ్యక్తం చేశారు.“ఒమన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిఖ్, కువైట్ యువరాజు సభా అల్`ఖాలీద్ అల్`సభా, ఖతార్ ఎమిర్ తవిÖమ్ బిన్ హమద్ అల్ థానీలతో ప్రధాని మోదీ ఫోన్‌లో వేర్వేరుగా మాట్లాడారు. ఈ దేశాలపై దాడులను ఖండించారు. అక్కడి భారతీయుల క్షేమ సమాచారం గురించి ఆరా తీశారు. వారి భద్రత గురించి చర్చించారు. దౌత్యమార్గాలు, చర్చల ద్వారా ప్రాంతీయ శాంతి, స్థిరత్వాన్ని పునరుద్ధరించాలని నేతలంతా ఏకాభిప్రాయానికి వచ్చారు” అని అధికార వర్గాలు తెలిపాయి. అమెరికా స్థావరాలపై దాడుల పేరిట పశ్చిమాసియాలోని దేశాలపై ఇరాన్ (ఎతీజీని) డ్రోన్లు, క్షిపణులు ప్రయోగిస్తున్న విషయం తెలిసిందే. ప్రధాని మోదీ ఇప్పటికే బహ్రెయిన్, సౌదీ అరేబియా, జోర్డాన్, యూఏఈ తదితర దేశాల అధినేతలతో మాట్లాడారు. పశ్చిమాసియాలో దాదాపు 90 లక్షలమంది భారతీయులు నివసిస్తున్నారు. ఇజ్రాయెల్‌లో 40 వేలమంది, ఇరాన్‌లో 10 వేలమంది ఉన్నారు.

తాజావార్తలు