ఖమేనీ హత్యపై మౌనమెందుకు?
` మోడీ తీరుపై మండిపడ్డ సోనియాగాంధీ
` ఇరాన్‌పై దాడి పట్ల మోదీ మాట్లాడరేం?
` ప్రధాని తీరుతో దిగజారుతున్న భారత్ ప్రతిష్ట
` మండిపడ్డ రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ(జనంసాక్షి):ఇరాన్ అధ్యక్షుడు అయాతుల్లా అలీ ఖమేనీ హత్యపై మోడీ ప్రభుత్వం మౌనం వహించడంపై కాంగ్రెస్ పార్టీ చైర్‌పర్సన్ సోనియాగాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ మౌనం వహించడం తటస్థంగా లేదని, బదులుగా ఇది పరాజయమని అన్నారు. భారత విదేశాంగ విధాన లక్ష్యము, విశ్వసనీయతపై సందేహం లేవనెత్తుతోందని అన్నారు. బ్జడెట్ సమావేశాల రెండవ భాగం కోసం పార్లమెంట్ తిరిగి సమావేశమైనపుడు, అంతర్జాతీయ వ్యవస్థ విచ్చిన్నంపై ప్రభుత్వ ’ఇబ్బందికరమైన నిశ్శబ్దం’ గురించి బహిరంగంగా మరియు ఎగవేయకుండా చర్చించాలని అన్నారు. జాతీయ విÖడియాలో ప్రచురితమైన తన వ్యాసంలో సోనియాగాంధీ మాట్లాడుతూ.. నైతిక బలాన్ని మనం తిరిగి కనుగొని దానిని స్పష్టత మరియు నిబద్ధతతో వ్యక్తీకరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇరాన్ అధ్యక్షుడు ఖమేనీని హత్య చేసపినట్లు అమెరికా మరియు ఇజ్రాయిల్ ధవీకరించింది. అమెరికా, ఇరాన్ మధ్య కొనసాగుతున్న చర్చల సమయంలో దేశాధినేతను హత్య చేయడం సమకాలీన అంతర్జాతీయ సంబంధాల్లో తీవ్ర చీలికను సూచిస్తుందని అన్నారు. అయితే, ఈ ఘటన షాక్‌కు మించి, భారత ప్రభుత్వ మౌనం కూడా అంతే దిగ్బాంª`రతికి గురిచేసిందని అన్నారు. భారత ప్రభుత్వం హత్యను లేదా ఇరాన్ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడాన్ని ఖండించడం మానుకుందని ఆమె పేర్కొన్నారు.
ఇరాన్‌పై దాడి పట్ల మౌనమెందుకు: రాహుల్
అమెరికా`ఇజ్రాయిల్`ఇరాన్‌ల వివాదంపై ప్రధాని మోడీ మౌనం ప్రపంచంలో భారత్ ఖ్యాతిని దిగజారుస్తోందని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ మంగళవారం పేర్కొన్నారు. ప్రపంచక్రమాన్ని నిర్వచించడానికి ఒక మార్గంగా దేశాధినేత హత్యకు మద్దతు ఇస్తున్నారా లేదా అనే దానిపై ప్రధాని మోడీ మాట్లాడాలని, సమాధానం చెప్పాలని అన్నారు. ఇరాన్‌పై ఏకపక్ష దాడులతో పాటు, ఇతర మధ్యప్రాచ్య దేశాలపపై ఇరాన్ దాడులను ఖండించాలని ఆయన అన్నారు. అమెరికా, ఇజ్రాయిల్ దాడుల్లో ఇరాన్ అధ్యక్షుడు ఖమేనీని హత్య చేసిన సంగతి తెలిసిందే. అమెరికా`ఇజ్రాయిల్`ఇరాన్‌ల మధ్య పెరుగుతున్న వైరుధ్యాలు సున్నితమైన ప్రాంతాన్ని తీవ్ర సంఘర్షణ వైపు నెడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సుమారు కోటిమంది భారతీయులతో సహా కోట్లాది మంది ప్రజలు అనిశ్చితిని ఎదుర్కొంటున్నారని అన్నారు. భద్రతాపరమైన ఆందోళనలు వాస్తవమే అయినప్పటికీ, సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించే దాడులు సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తాయి. ఇరాన్‌పై ఏకపక్ష దాడులు, అలాగే ఇతర మధ్యప్రాచ్య దేశాలపై ఇరాన్ దాడులను ఖండించాలి. ఘర్షణలు మరింత ఘర్షణలకు దారితీస్తాయి. చర్చలు మరియు సంయమనం శాంతికి ఏకైక మార్గం అని అన్నారు. భారతదేశం నైతికంగా స్పష్టంగా ఉండాలి. అంతర్జాతీయ చట్టం మరియు మానవుల ప్రాణాలను కాపాడుకోవడంలో మనం స్పష్టంగా మాట్లాడే ధైర్యం కలిగి ఉండాలి. మన విదేశాంగ విధానం సార్వభౌమాధికారం మరియు వివాదాల శాంతియుత పరిష్కారాన్ని సూచిస్తుంది. అది స్థిరంగా ఉండాలని అన్నారు. మధ్యప్రాచ్యం సంఘర్షణపై ప్రధాని మోడీ మాట్లాడాలని పునరుద్ఘాటించారు. ప్రపంచ క్రమాన్ని నిర్వచించే మార్గంగా ఒక దేశాధినేత హత్యను సమర్థిస్తారా అని ప్రధాని మోడీని నిలదీశారు.

