కాంగ్రెస్ నేతలకు ట్విట్టర్ షాక్
రాహుల్ సహా పలువురి ఖాతాల నిలిపివేత
ట్విట్టర్ బిజెపి ఆధీనంలోకి వెళ్ళిందని కాంగ్రెస్ విమర్శలు
న్యూఢల్లీి,అగస్టు12(జనం సాక్షి): కాంగ్రెస్ నేతలకు ట్విట్టర్ షాక్ ఇచ్చింది. రాహుల్ సహా అనేకమంది కాతాలను నిలిపివేసింది. గైడ్‌లైన్స్ ఫాలో కాలేదంటూ రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ సహా అనేక మంది కాంగ్రెస్ నేతల ఖాతాలకు ట్విట్టర్ ఇండియా లాక్ వేసింది. కాగా దీనిపై కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ట్విట్టర్ ఇండియాపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ట్విట్టర్ ఇండియా పూర్తిగా భరతీయ జనతా పార్టీ గుప్పిట్లోకి వెళ్లిపోయిందని, ఆర్ఎస్ఎస్ ఆదేశాల మేరకు పని చేస్తోందని ఆరోపిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ నేతలు చేసిన కొన్ని సున్నిత సమాచారం ఉన్న పోస్టులను ట్వీట్ చేస్తూ.. వారివి ఎందుకు ట్విట్టర్ గైడ్‌లైన్స్‌లోకి రావంటూ మండిపడుతున్నారు. ఢల్లీిలో అత్యాచారం జరిగిన ఓ చిన్నారితో రాహుల్ గాంధీ మాట్లాడారు. కాగా ఆ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. అయితే ట్విట్టర్ గైడ్‌లైన్స్‌ను రాహుల్ అధిగమించారంటూ ఆయన ఖాతాను ఆగస్టు 6న లాక్ వేశారు. అంతటితో ఆగకుండా కాంగ్రెస్ అధికారిక ఖాతాను కాంగ్రెస్ నేతల, కార్యకర్తల ఖాతాలకు లాక్ వేశారు. ఇందులో వెరిఫైడ్ ఖాతాలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. ఈ విషయమై కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ ఖాతాకు లాక్ వేస్తే వేల మంది రాహుల్ గాంధీలు వస్తారని, ప్రజల గొంతుకను వినిపిస్తూనే ఉంటారని యూత్ కాంగ్రెస్ అధినేత శ్రీనివాస్ తన ట్విట్టర్ ఖాతాలో రాసుకొచ్చారు. అంతే కాకుండా తన ఖాతాకు రాహుల్ గాంధీ అని పేరు మార్చి ట్విట్టర్‌పై దుమ్మెత్తి పోస్తున్నారు. ఇక కొందరైతే ట్విట్టర్ పిట్టకు కాషాయం రంగు పూసి, ’సంఫీు ట్విట్టర్’ అంటూ విమర్శిస్తున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, బాధితులకు న్యాయం చేయమని అడగడం, ప్రభుత్వ తప్పిదాల్ని బహిరంగ పర్చడం కూడా తప్పేనా అంటూ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఎన్ఎస్యూఐ మండిపడిరది. ’ట్విట్టర్ మోదీ సే డర్ గయా’ అనే హ్యాష్‌ట్యాగ్ ప్రస్తుతం ట్విట్టర్ ట్రెండిరగ్‌లో టాప్‌లో ఉంది. ఇక కాంగ్రెస్‌కు రాహుల్ గాంధీకి మోదీ భయపడుతున్నారని, అందుకే రాహుల్ సహా కాంగ్రెస్ నేతల గొంతును అడ్డుకుంటున్నారని మరికొంత మంది విమర్శలు గుప్పిస్తున్నారు.
నిబంధనలను ఉల్లంఘించినందుకు కాంగ్రెస్ పార్టీతోపాటు ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ సహా మరికొందరు పార్టీ సీనియర్ నేతల అధికారిక ఖాతాలను ట్విటర్ బ్లాక్ చేసింది. దీనిపై కాంగ్రెస్ సోషల్ విూడియా హెడ్ రోహన్ గుప్తా మాట్లాడుతూ, ప్రజల గళాన్ని వినిపించడం నుంచి తమ పార్టీని ఎవరూ నిరోధించ లేరని చెప్పారు. ప్రభుత్వ ఒత్తిడి మేరకు దేశవ్యాప్తంగా దాదాపు 5,000 మంది పార్టీ నేతల ఖాతాలను ట్విటర్ బ్లాక్ చేసిందన్నారు. ఢల్లీిలో తొమ్మిదేళ్ళ బాలికపై కొందరు దుండగులు అత్యాచారం చేసి, హత్య చేసినట్లు కేసు నమోదైంది. బాధితురాలి కుటుంబ సభ్యులను రాహుల్ గాంధీ ఈ నెల 4న పరామర్శించి, న్యాయం జరిగే వరకు తాము అండగా ఉంటామని చెప్పారు. ఈ సందర్భంగా ఆ బాలిక తల్లిదండ్రులతో కలిసి ఉన్న ఫొటోను రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.