ఉత్తరాది గజగజ
` హిమాచాల్, కాశ్మీర్‌లపై మందుదుప్పటి
` మంచు కారణంగా జాతీయ రహదారుల మూసివేత
` ఉత్తరాది రాష్ట్రాల్లో పెరిగిన చలిగాలులు
న్యూఢల్లీి(జనంసాక్షి):హిమాచల్‌ప్రదేశ్, జమ్ముకాశ్మీర్, ఉత్తరాఖండ్‌లపై దట్టమైన మంచు దుప్పటి పరుచుకుంది. దట్టమైన మంచుతో పలు జాతీయ రహదారులను మూసివేసినట్లు అధికారులు ప్రకటించారు. హిమాచల్‌ప్రదేశ్‌లో మూడు జాతీయ రహదారులతో పాటు సుమారు 266 రహదారులు మూసివేయబడ్డాయి. మూసివేసిన 266 రహదారుల్లో సిమ్లాలో 123, లాహౌల్‌లో 36, స్పితి, కులులో 25 ఉన్నాయి. 173 ట్రాన్స్‌ఫార్మర్‌లకు అంతరాయం ఏర్పడిరదని, దీంతో రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ సరఫరాపై తీవ్ర ప్రభావం పడిరదని తెలిపింది. హిమాచల్‌ప్రదేశ్‌లో తీవ్రమైన చలి పరిస్థితుల కారణంగా భారత వాతావరణ విభాగం (ఐఎండి) ’ఆరెంజ్’ అలర్ట్ జారీ చేసింది. దట్టమైన పొగమంచు ఉండే అవకాశం ఉందని, కొన్ని ప్రాంతాల్లో వారాంతంలో వర్షం, మంచు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో భారీ హిమపాతం కురిసింది. త్యుని-చక్రతా-ముస్సోరి జాతీయ రహదారిపై 30 కి.విూ మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. రాష్ట్రంలోని ధరణాధర్-కోటి కనసర్ రహదారిపై భారీ మంచుతో ఢల్లీి నుండి వచ్చిన ఇద్దరు పర్యాటకులు చిక్కుకుపోయారని స్థానిక విూడియా తెలిపింది. ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాల్లోనూ దట్టమైన మంచు కమ్మేసింది. జమ్ముకాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో కనిష్ట ఉష్ణోగ్రత మైనస్ 7 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది. ఇకపోతే చలి తీవ్రతతో ఉత్తర భారతం గజగజలాడుతోంది. ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. కశ్మీర్‌లోని పలు ప్రదేశాలు చలికి అల్లాడిపోతున్నాయి. జలాశయాలు గడ్డకట్టుకుపోయాయి. నీటి సరఫరా గొట్టాల్లో నీరు గడ్డకట్టేస్తోంది. శ్రీనగర్‌లో మైనస్ 7.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. రాబోయే రెండ్రోజుల్లో ఇది మరో 2-3 డిగ్రీల వరకు తగ్గిపోతుందని వాతావరణ విభాగం అంచనా వేసింది. కశ్మీర్‌లో అత్యంత చల్లగా ఉండే 40 రోజుల కాలం ఈ నెల 21న ప్రారంభమైంది. అప్పటి నుంచి కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా ఉంటున్నాయి. అమర్‌నాథ్ యాత్రకు బేస్‌క్యాంపు అయిన పహాల్గామ్‌లో మైనస్ 8.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంది. రాజస్థాన్‌లోని అనేక ప్రాంతాలను దట్టమైన పొగమంచు కమ్మేస్తోంది. పశ్చిమ రాజస్థాన్‌లోని పలు ప్రాంతాలకు అత్యంత చల్లని రోజుగా బుధవారం నిలిచిపోయింది. పంజాబ్, హరియాణాల్లోనూ శీతల గాలులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దిల్లీని పొగమంచు కప్పేసింది. దిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతాల్లో బుధవారం తెల్లవారుజామున 9.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మంచు దట్టంగా కురుస్తూ.. 100 విూటర్ల దూరంలో ఉన్న వాహనాలు కూడా కన్పించని పరిస్థితి నెలకొంది. దీంతో పలు విమానాలు, రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం వాటిల్లింది. వాయు నాణ్యతా సూచీ (ఏక్యూఐ) 334గా నమోదైంది.
హైదరాబాద్‌లో స్వల్ప వర్షం..
` పెరిగిన చలి తీవ్రత
హైదరాబాద్(జనంసాక్షి):అల్పపీడనం ప్రభావంతో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో గురువారం మోస్తరు వర్షం కురిసింది. వివిధ పనులపై బయటకు వచ్చిన వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.నగరంలోని సికింద్రాబాద్, తిరుమలగిరి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అవిూర్‌పేట, బోరబండ, కూకట్‌పల్లి, బాచుపల్లి, తార్నాక, కోఠి, నాంపల్లి, హిమాయత్ నగర్ తదితర ప్రాంతాల్లో వర్షానికి జనం తడిసి ముద్దయ్యారు. వర్షానికి తోడు చలి తీవ్రత కూడా పెరగడంతో ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.