జనంసాక్షి ఖమ్మం జిల్లా క్యాలెండర్ ఆవిష్కరించిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల
ఖమ్మం (జనంసాక్షి): జనంసాక్షి దినపత్రిక రూపొందించిన నూతన సంవత్సరం 2025 క్యాలెండర్ ను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆవిష్కరించారు. ఖమ్మంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో బుధవారం కార్యకర్తల సమక్షంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దమ్మున్న వార్తలతో, నిజాలను నీకు తెలుస్తూ, సత్యశోధన చేస్తూ నిరంతరం ప్రజల పక్షాన పోరాడుతున్న పత్రిక జనంసాక్షి అని కొనియాడారు. ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి వాటి పరిష్కారానికి కృషి చేయాలని జనం సాక్షి విలేకరుల బృందానికి సూచించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, కార్పొరేటర్ కమర్థపు మురళి, ప్రముఖ కాంగ్రెస్ నాయకులు మిక్కిలినేని నరేంద్రబాబు చౌదరి, నల్లమల వెంకటేశ్వరరావు, జనం సాక్షి ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో కూరాకుల గోపి, ఖమ్మం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ షేక్ సుభాన్, దిశా ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో దువ్వా సాగర్, జనంసాక్షి పాలేరు నియోజకవర్గ ఇన్చార్జి మేఘనాధరావు, జనం సాక్షి రిపోర్టర్లు ప్రవీణ్, సుభాని, శ్రీనివాస్, మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.