మచ్చలేని మహా మనిషి.. ఆర్థిక సంస్కరణల ఋషి..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఇకలేరు
` వృద్ధాప్య సమస్యలతో ఢల్లీి ఎయిమ్స్‌లో తుదిశ్వాసవిడిచిన మహానేత
న్యూఢల్లీి(జనంసాక్షి):కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) కన్నుమూశారు. తీవ్ర అస్వస్థతకు గురై దిల్లీ ఎయిమ్స్‌లో చేరిన ఆయన చికిత్స పొందుతూ గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు.దేశంలో ఎన్నో ఆర్థిక సంస్కరణలు చేపట్టిన వ్యక్తిగా నిలిచిన మన్మోహన్ సింగ్.. అక్టోబర్ 1991లో తొలిసారి రాజ్యసభలో డుగుపెట్టారు. 1991 నుంచి 1996 వరకు పీవీ నరసింహారావు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పని చేసిన ఆయన.. ఆ తర్వాత 2004 నుంచి 2014 వరకు పదేళ్ల పాటు భారత ప్రధానిగా సేవలందించారు. దేశాన్ని సుదీర్ఘకాలంపాటు పాలించిన ప్రధానుల్లో ఒకరిగా నిలిచారు. ఆయన 26 సెప్టెంబరు 1932లో జన్మించారు. జన్మస్థలం.. మా, పంజాబ్ (ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉంది) 14 సెప్టెంబరు 1958లో వివాహం జరిగింది. భార్య గురుశరణ్ కౌర్, కుమార్తెలు ఉపేందర్, దామన్ అమృత్‌లు ఉన్నారు.
చదువు: పంజాబ్ విశ్వవిద్యాలయం నుంచి ఆర్థిక శాస్త్రంలో 1952లో బీఏ, 1954లో ఎంఏ పట్టా
కేంబ్రిడ్జ్ నుంచి ఆర్థిక శాస్త్రంలో ట్రైపోస్
ఆక్స్‌ఫర్డ్ నుంచి ఎం.ఎ. డి.ఫిల్ (1962)
హోనరిస్ కాసా నుంచి డి.లిట్
1982`85 మధ్య ఆర్బీఐ గవర్నర్‌గా పనిచేశారు.
1991`96 మధ్య పీవీ నరసింహారావు హయాంలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.
ప్రధాని పీఠాన్ని అధిష్టించిన తొలి హిందూయేతర వ్యక్తిగా మన్మోహన్ రికార్డు .
మన్మోహన్ సింగ్ హయాంలో అత్యధిక జీడీపీ (10.2శాతం) వృద్ధిరేటు నమోదైంది.
మన్మోహన్ హయాంలోనే వెనుకబడిన వర్గాలకు 27శాతం సీట్ల కేటాయింపు జరిగింది.
1987లో మన్మోహన్‌కు పద్మవిభూషణ్ ప్రదానం.
ప్రణాళిక సంఘం డిప్యూటీ ఛైర్మన్‌గానూ బాధ్యతలు నిర్వహించారు.
ప్రధానిగా రోజూ 18 గంటల పాటు అవిశ్రాంతంగా పనిచేశారు.
2005లో సమాచార హక్కు చట్టాన్ని తీసుకొచ్చారు.
2005లో మహాత్మాగాంధీ జాతీయ గ్రావిూణ ఉపాధి హావిూ పథకాన్ని ప్రారంభించారు.
2017లో ఇందిరాగాంధీ శాంతి బహుమతి అందుకున్నారు.
1993, 94లో ఉత్తమ ఆర్థిక మంత్రిగా యూరో మనీ అవార్డు అందుకున్నారు.
1998`2004 మధ్య రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు.
2010లో వరల్డ్ స్టేట్స్ మెన్ అవార్డు వరించింది.
ఫోర్బ్స్ అత్యంత శక్తిమంతుల జాబితాలోనూ మన్మోహన్‌కు చోటు దక్కింది.
దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసిన గొప్ప వ్యక్తి
` మాజీ ప్రధాని మృతి పట్ల ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డిగ్భ్భ్రాంతి
హైదరాబాద్(జనంసాక్షి):మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి చెందడం పట్ల రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ చిన్నారెడ్డిగ్భ్భ్రాంతి వ్యక్తం చేశారు.దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసిన గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్ అని, ఉపాధి హావిూ పధకం, సమాచార హక్కు చట్టం సహా దేశ అత్యున్నత అనేక పదవులు నిర్వహించిన ఘనత మన్మోహన్ సింగ్ కు దక్కుతుందని చిన్నారెడ్డి పేర్కొన్నారు.ఆర్థిక శాఖ మంత్రిగా, రిజర్వ్ బ్యాంకు గవర్నర్ గా, కేంద్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ గా, యూజీసీ చైర్మన్ గా వంటి అనేక పదవులు నిర్వహించిన గొప్ప మేధావి మన్మోహన్ సింగ్ అని చిన్నారెడ్డి కొనియాడారు.మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులకు చిన్నారెడ్డి ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలిపారు.
గొప్ప ఆర్ధిక వేత్త, మహా నాయకుడు
` మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్(జనంసాక్షి):మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గొప్ప ఆర్ధిక వేత్త, మహా నాయకుడు, సంస్కరణ వాది అన్నింటికి మించి గొప్ప మానవతావాది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మృతితో దేశం ఒక గొప్ప కుమారుడిని కోల్పోయిందని సీఎం అవేదన వ్యక్తం చేశారు. మాజీ ప్రధానమంత్రి మృతిపై తన సంతాపాన్ని, ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని సీఎం తెలియజేశారు.. నిర్ణయాల తీసుకోవడంలో సమగ్రత, పారదర్శకత అన్నింటికీ మించి మానవీయ స్పర్శను జోడిరచేవారని, నవ భారత శిల్పుల్లో మన్మోహన్ సింగ్ ఒకరని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు..రాజకీయ, ప్రజా జీవితంలో గౌరవ మర్యాదలు ఎలా పాటించాలో ఆయన తన ప్రవర్తన ద్వారా చూపించారని సీఎం పేర్కొన్నారు.