క్రీడాల జీవో హర్షణీయం

కడప, జూలై 28 : రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల్లో క్రీడాలను తప్పని సరిగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేయడం హర్షనీయమని ఎన్‌ఎస్‌యుఐ జిల్లా అధ్యక్షుడు ఫిరోజ్‌ ఖాన్‌ శనివారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు మానసిక ఉల్లసానికి క్రీడాలు దోహదపడుతాయని ఆయన అన్నారు. ప్రతి విద్యాసంస్థలో క్రీడాలను నిర్వహించాలని ప్రభుత్వం జీవోలను జారీ చేయడం మంచిదేనని చెప్పారు.