బతుకులు బుగ్గిపాలు
` కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం
` టూరిస్ట్ బస్సును ఢీకొన్న డీజిల్ ట్యాంకర్
` మంటలు చెలరేగడంతో 17మంది బుగ్గి
` క్షతగాత్రులకు ఆస్పత్రుల్లో చికిత్స
` రాష్ట్రపతి , ప్రధాని మోడీ సంతాపం
బెంగళూరు(జనంసాక్షి):కర్నాటకలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును లారీ ఢీ కొట్టడంతో బస్సులలో మంటలు చెలరేగి 17 మంది సజీవ దహనమయ్యారు. మరో మరో 13 మంది గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటన చిత్రదుర్గ జిల్లా జవరగుండనహళ్లి శివారులో తెల్లవారు 3 గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది. బెంగళూరు నుంచి గోకర్ణం వెళ్తున్న బస్సును లారీ ఢీ కొట్టింది. లారీ డ్రైవర్ సహా 17 మంది మృత్యువాత పడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 29 మంది ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను హాస్పిటల్‌కు తరలించారు. బెంగళూరు నుంచి గోకర్ణ వెళ్తున్న సీబర్డ్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును కంటెయినర్ లారీ ఢీకొట్టింది. లారీ.. డివైడర్‌ను దాటి ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొట్టడంతో బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 17 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. చిత్రదుర్గ జిల్లాలోని జాతీయ రహదారి`48పై గోర్లత్తు క్రాస్ వద్ద గురువారం వేకువజామున 2.30 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 32 మంది ప్రయాణికులు ఉన్నారు. చిత్రదుర్గ, తుమకూరు జిల్లాల పరిధిలోని అధికార యంత్రాంగం ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి అతివేగం, పొగమంచు కారణమని భావిస్తున్నారు. బస్సుతో పాటు కంటెయినర్ లారీకి కూడా మంటలు వ్యాపించాయి. ప్రమాదం జరిగిన వెంటనే బస్సు డ్రైవర్, కో డ్రైవర్ అందులోంచి దూకి తప్పించుకున్నారు. మరికొందరు ప్రయాణికులు అద్దాలను పగులగొట్టి ప్రాణాలు కాపాడుకున్నారు. వారిలో గగన, రక్షిత అనే యువతులు ఉన్నారు. తమ స్నేహితురాలు రష్మి కనిపించడం లేదని వారు కన్నీరుమున్నీరయ్యారు. ప్రయాణికుల్లో కొంతమందికి గాయాలు కావడంతో వారిని సిరా, హిరాయూరు ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.ప్రయాణికుల్లో కొందరి పేర్లను అధికారులు గుర్తించారు. ఆ వివరాల ప్రకారం.. బస్సులో మంజునాథ్, సంధ్య, శశాంక్, దిలీప్, ప్రీతీశ్వరన్, వి బిందు, కె కవిత, అనిరుధ్ బెనర్జీ, అమృత, కల్పన, ప్రజాపతి, ఎం శశికాంత్, విజయ్ భండారీ, నవ్య, అభిషేక్, హెచ్.కిరణ్‌పాల్, ఎం.కీర్తన్ ఉన్నట్లు తెలుస్తోంది.ఈ బస్సు ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధానమంత్రి నరేంద్రమోదీ దిగ్భార్రతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. పీఎం రిలీఫ్ ఫండ్ కింద మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేల చొప్పున నష్టపరిహారం అందించనున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటించింది.
తృటిలో తప్పిన మరో పెనుప్రమాదం
` ప్రమాద బస్సును స్వల్పంగా ఢీకొని పక్కకు జరిగిన స్కూల్ బస్సు
` ప్రాణాపాయం నుంచి బయటపడ్డ విద్యార్థులు
బెంగుళూరు(జనంసాక్షి):కర్ణాటకలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం పలు కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదం నుంచి 40 మందికి పైగా స్కూల్ విద్యార్థులు త్రుటిలో తప్పించు కున్నట్లు తాజాగా తెలిసింది. ఈ విషయాన్ని పోలీసు అధికారులు వెల్లడిరచారు. టి.దర్శహళ్లి నుంచి దండేలికి వెళ్తున్న ఓ టూర్ బస్సు.. ప్రమాదానికి గురైన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు సమాంతరంగా ప్రయాణించింది. ఈ టూర్ బస్సులో 42 మంది విద్యార్థులు ఉన్నారు. ట్రావెల్స్ బస్సును లారీ ఢీకొనడంతో ఆ ప్రమాద ధాటికి స్కూల్ బస్సు కూడా అదుపు తప్పింది. ఈక్రమంలో స్కూల్ బస్సు ప్రమాదానికి గురైన ప్రైవేట్ బస్సును వెనక నుంచి ఢీకొట్టి రోడ్డు పక్కకు జారింది. అయితే, పిల్లల బస్సుకు ఎలాంటి ప్రమాదం జరగలేదని ఐజీపీ రవికాంతేగౌడ వెల్లడిరచారు. విద్యార్థులను తీసుకెళ్తున్న బస్సు డ్రైవర్ స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేసినట్లు తెలిపారు. ఘటనపై బస్సు డ్రైవర్ మాట్లాడుతూ.. ‘డివైడర్‌కు మరోవైపున ప్రయాణిస్తున్న లారీ ఒక్కసారిగా తాను వెళ్తున్న రోడ్డు పైకి దూసుకొచ్చింది. లారీ ఢీకొట్టబోతోందని అర్థమై బస్సును కంట్రోల్ చేసేందుకు ప్రయత్నించా. కానీ అప్పటికే ప్రమాదం జరిగింది. ప్రమాదం ధాటికి మా బస్సు పక్కనే వెళ్తోన్న మరో వాహనాన్ని కూడా తాకింది. అయితే ఆ వాహనం ఏంటో నేను చూడలేకపోయా. అతివేగం కారణంగానే ఈ ఘటన చోటుచేసుకుంది‘ అని ట్రావెల్స్ బస్సు డ్రైవర్ వివరించారు. చిత్రదుర్గ జిల్లాలోని జాతీయరహదారి`48పై గోర్లత్తు క్రాస్ వద్ద గురువారం వేకువజామున 2.30 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బెంగళూరు నుంచి గోకర్ణ వెళ్తున్న సీబర్డ్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును కంటెయినర్ లారీ ఢీకొట్టింది. బస్సు డీజిల్ ట్యాంక్‌కు మంటలు అంటుకోవడంతో ప్రమాదం జరిగింది.
బోల్తాపడ్డ స్కూల్ బస్సు
` స్వల్ప గాయాలతో బయటపడ్డ విద్యార్థులు
` మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ వద్ద ఘటన
` విహారయాత్రకు వెళుతుండగా ప్రమాదం
జడ్చర్ల(జనంసాక్షి):మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ వద్ద స్కూల్ బస్సు బోల్తా పడిరది. పలువురు విద్యార్థులు స్వల్పంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నారాయణపేట జిల్లా మరికల్ లోని మణికంఠ జూనియర్ కాలేజీకి చెందిన బస్సు విహారయాత్రకు వెళుతుండగా బోల్తా పడిరది. హైదరాబాద్‌లోని జలవిహార్‌కు వెళ్లేందుకు కాలేజీకి చెందిన బస్సులో ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో బాలా నగర్ వద్ద హైదరాబాద్`బెంగళూరు హైవేపై ప్రమాదవశాత్తు బోల్తాపడిరది. ఈ ప్రమాదంలో విద్యార్థులకు స్వల్ప గాయాలు అయినట్లు పోలీసులు తెలిపారు. త్రుటిలో పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం
` ఘటనలో నలుగురు మహిళల మృతి
` మృతులు కాగజ్‌నగర్ వాసులుగా గుర్తింపు
కాగజ్‌నగర్(జనంసాక్షి):క్రిస్మస్ పండగ పూట దేశంలో పెను విషాదలు చోటు చేసుకుంది. గురువారం తెల్లవారుజున కర్ణాటకలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 17 మంది మృతి చెందిన ఘటన జరిగి కొన్ని గంటలు కూడా గడవక ముందే… అటు మహారాష్ట్రలో మరో ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. వైద్యం కోసం వెళ్లి వస్తున్న వారిని మృత్యువు కబళించింది. వైద్యం నిమిత్తం మహారాష్ట్ర వెళ్లిన ఓ పేద కుటుంబం తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరంతా తెలంగాణ రాష్ట్రం కొమురం భీం జిల్లాకు చెందిన వారుగా గుర్తించారు. మహారాష్ట్ర లోని చంద్రాపూర్ జిల్లా దేవాడ దగ్గర ఓ కారు అదుపుతప్పి బోల్తా పడిరది. ఈ ప్రమాదంలో నలుగురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. కొమురం భీం జిల్లా కాగజ్‌నగర్‌కు చెందిన ఆటో డ్రైవర్ జాకీర్ కుటుంబ సభ్యులు, తమ బంధువులతో కలిసి వైద్యం కోసం మహారాష్ట్ర నాగపూర్‌లోని ఓ ఆస్పత్రికి వెళ్లారు. వైద్యం చేయించుకున్న అనంతరం తిరిగి సొంతూరుకు బయలుదేరిన సమయంలో అనుకోని ప్రమాదం వారిని వెంటాడిరది. రేవాడ సవిూపంలోని ఓ బ్రిడ్జ్ వద్ద వీరు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి బోల్తా పడిరది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న వారిలో నలుగురు మహిళలు మృతి చెందారు. మృతులు సల్మా బేగం, శబ్రీమ్, ఆప్జా బేగం, సహారగా గుర్తించారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో హుటాహుటిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ కుటుంబంలోని నలుగురు చనిపోవడంతో కాగజ్‌నగర్‌లో విషాదం నెలకొంది.


