కేసీఆర్‌కు తగ్గ భాషే వాడుతున్నారు
` తిట్ల పురాణం మొదలుపెట్టిందే కేసీఆర్
` ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్
హైదరాబాద్(జనంసాక్షి):బీఆర్‌ఎస్ నేత హరీష్ రావుకు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. గురువారం చామల విూడియాతో మాట్లాడుతూ.. దయ్యాలు వేదాలు వల్లించినట్లు హరీష్ రావు వ్యవహార శైలి ఉందని విమర్శించారు. నీతులు ఎదుటి వారికి మాకు కాదు అన్నట్లు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ తిట్ల పురాణం, బూతులు ఒకసారి చూడాలని హరీష్ రావుకు సూచించారు. ఉద్యమం సమయంలో నోటికి వచ్చిట్లు కేసీఆర్ మాట్లాడారు. రాజకీయాల్లో తిట్ల పురాణం మొదలుపెట్టిందే కేసీఆర్.. కేసీఆర్ రాజకీయంగా మాట్లాడితే రేవంత్ రెడ్డి రాజకీయాలు మాట్లాడతారు.. కేసీఆర్ తిట్ల పురాణం మాట్లాడితే రేవంత్ రెడ్డి విూకంటే ఎక్కువ తిట్లు తిట్టగలరని కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ ఓడిపోయిన తర్వాత రెండు ఏళ్ల తర్వాత బయటకు వచ్చి తోలు తీస్తామంటే చూస్తూ ఊరుకోవాలా…? అని ప్రశ్నించారు. సీఎం స్థాయి వ్యక్తిని తోలు తీస్తామంటే మర్యాదగా మాట్లాడాలా…? అని అడిగారు. నీళ్లు, నిజాలపై అసెంబ్లీలో చర్చ చేద్దాము రండి అని సవాల్ చేశారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో జరిగిన అవకతవకలు, అవినీతిపై చర్చ చేద్దామని చెప్పారు. విూరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే విూకు రేవంత్ రెడ్డి అదే స్థాయిలో సమాధానం చెప్తారని అన్నారు. రేవంత్ రెడ్డి ఛాలెంజ్ చేసి మిమ్మల్ని 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిరచారు.. 2029 అసెంబ్లీ ఎన్నికల్లో మిమ్మల్ని రేవంత్ రెడ్డి ఇంటికి పంపిస్తారు.. విూరు మారండి ప్రతిపక్ష నాయకులుగా సలహాలు, సూచనలు ఇవ్వండని హితవు పలికారు. సీఎం, మాజీ సీఎం ఒకరిని ఒకరు గౌరవించుకోవాలని బండి సంజయ్ అన్నారు. బండి సంజయ్ భాష గురించి మాట్లాడుతున్నారు. మేము చెప్పే అంశాలను ఆ దద్దమ్మలకు చెప్పాలని బండి సంజయ్ కు విజ్ఞప్తి చేస్తున్నా అని చామల కిరణ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.



