ఘనంగా డాక్టర్ శ్రీపాద పినాకపాణి జన్మదినం
కర్నూలు, ఆగస్టు 3 : పద్మభూషణ్, సంగీత కళానిధి బిరుదాంకితులు డాక్టర్ శ్రీపాద పినాకపాణి శుక్రవారం వందో జన్మదినోత్సవం వైభవంగా జరిగింది. టీటీడీ సీఈఓ డాక్టర్ ఎల్వీ సుబ్రహ్మణ్యం పినాకపాణికి స్వగృహంలో బొకెను అందజేసి జన్మదిన శుభాకాంక్షలు అందజేశారు. టీటీడీ తరుఫున రూ. పది లక్షల బహుమానం పినాకపాణికి అందజేయనున్నట్టు ఆయన తెలిపారు.అలాగే ప్రభుత్వం తరుఫున స్థానిక సునాయన ఆడిటోరియంలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా డాక్టర్ పినాకపాణి స్వగృహంలో బెడ్‌పై పడుకునే అందరినీ పరామర్శించారు. తనను చూసేందుకు వచ్చిన వారందరినీ పలకరించారు. అలాగే విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. చివరగా తన సంగీతాన్ని పాడి వినిపించారు. సంగీతం అనంతమని అందుకు అందరి సహకారం అవసరమని అన్నారు.