అంబేడ్కర్‌ను అవమానిస్తావా!

` అమిత్‌షా రాజీనామా చేయ్‌
` పార్లమెంట్‌ వద్ద గందరగోళ వాతావరణం
` పరస్పర ఆందోళనలకు దిగిన కాంగ్రెస్‌, బీజెపి పక్షాలు
` తోపులాటలో ఇద్దరు పలువురు ఎంపీలకు గాయాలు
` నీలిరంగు దుస్తులు ధరించి అంబేడ్కర్‌ చిత్రపటాలతో కాంగ్రెస్‌ నాయకుల నిరసన
` అంబేడ్కర్‌ అంశంపై దేశవ్యాప్త ఉద్యమం చేస్తాం
` రాహుల్‌తో కలిసి మీడియా సమావేశంలో ఖర్గే వెల్లడి
న్యూఢల్లీి(జనంసాక్షి):రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేద్కర్‌పై కేంద్ర మంత్రి అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ గురువారం ఇండియా కూటమి నేతలు పార్లమెంట్‌ ఆవరణలో నిరసన చేపట్టారు. అంబేద్కర్‌తో లింకు ఉన్న బ్లూ రంగు దుస్తుల్లో ఇండియా కూటమి ఎంపీలు పార్లమెంట్‌కు వచ్చారు. రాహుల్‌ గాంధీ, ప్రియాంకా గాంధీలు.. బ్లూ రంగు దుస్తులను వేసుకున్నారు. అమిత్‌ షా రాజీనామా చేయాలంటూ డిమాండ్‌ చేశారు. రాజ్యాంగ నిర్మాతను అవమానించినట్లు ఇండియా కూటమి ఎంపీలు ఆరోపించారు. అంబేద్కర్‌ ఫోటోలతో ఎంపీలు.. అంబేద్కర్‌ విగ్రహం నుంచి పార్లమెంట్‌ ప్రధాన ఎంట్రీ గేటు వరకు ర్యాలీ తీశారు. అంబేద్కర్‌ పేరును పదేపదే ఉచ్చరించడం ఫ్యాషన్‌ అయిపోయినట్లు రెండు రోజుల క్రితం రాజ్యసభ ప్రసంగంలో అమిత్‌ షా వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ ఇండియా కూటమి నేతలు ఆందోళన చేపట్టారు. కాగా పార్లమెంట్‌ ప్రాంగణంలో గురువారం గందరగోళ వాతావరణం నెలకొంది. పరస్పర తోపులాటల్లో బిజెపి ఎంపిలు ఇద్దరికి గాయాలయ్యాయి. ఆయనను హుటాహుటిని ఆస్పత్రికి తరలించారు. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌పై అమిత్‌ షా వ్యాఖ్యలకు నిరసనగా ప్రతిపక్ష ఎంపీలు ఆందోళన చేపట్టారు. అటు అంబేడ్కర్‌ను కాంగ్రెస్‌ అవమానించిందని ఆరోపిస్తూ అధికార పక్షం కూడా నిరసన చేపట్టారు. ఇరువర్గాల ఆందోళనలతో పార్లమెంట్‌ ప్రాంగణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇందులో భాజపాకు చెందిన ఇద్దరు ఎంపీలు తీవ్రంగా గాయపడ్డారు. కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ తోయడం వల్లే వీరు గాయపడ్డారని భాజపా ఆరోపిస్తోంది. పార్లమెంట్‌లోని మకరద్వారం వద్ద ఉన్న గోడ ఎక్కి ప్రతిపక్ష ఇండియా కూటమి ఎంపీలు ప్లకార్డులు చూపిస్తూ ఆందోళన చేపట్టారు. అదే సమయంలో అక్కడకు ఎన్డీయే కూటమి ఎంపీలు వచ్చారు. వీరిని లోపలికి వెళ్లకుండా విపక్ష నేతలు అడ్డుకున్నారని భాజపా ఆరోపించింది. ఈ క్రమంలోనే కొంత గందరగోళం చోటుచేసుకుని భాజపా ఎంపీలు ముకేశ్‌ రాజ్‌పుత్‌, ప్రతాప్‌ చంద్ర సారంగి కిందపడి గాయపడ్డారు. వీరిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.ప్రస్తుతం ఎంపీ ముకేశ్‌ రాజ్‌పుత్‌కు ఐసీయూలో చికిత్స అందించారు. మరో ఎంపీ ప్రతాప్‌ చంద్ర సారంగి తలకు గాయమైంది. వీరి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు స్పందించారు. ‘ఇద్దరు ఎంపీల తలలకు దెబ్బలు తగిలాయి. సారంగి తలకు లోతైన గాయం కావడంతో తీవ్ర రక్తస్రావం జరిగింది. తలకు కుట్లు వేశాం. ముకేశ్‌ రాజ్‌పుత్‌ స్పృహ కోల్పోయిన స్థితిలో వచ్చారు. వైద్యం అందించాక ఆయన కోలుకుని స్పృహలోకి వచ్చారు‘ అని వైద్యులు వెల్లడిరచారు. వీరిని పలువురు కేంద్రమంత్రులు, తెదేపా ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తదితరులు ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. ప్రధాని మోదీ ఫోన్లో పరామర్శించారు. వారి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రికి తీసుకెళ్లే సమయంలో ఎంపీ ప్రతాప్‌ సారంగి విూడియాతో మాట్లాడుతూ.. ‘నేను మెట్ల వద్ద నిల్చొని ఉండగా.. రాహుల్‌ గాంధీ ఓ ఎంపీని నెట్టేశారు. ఆయన వచ్చి నాపై పడటంతో నేను కిందపడ్డాను‘ అని ఆరోపించారు. ఈ ఘటన నేపథ్యంలో రాహుల్‌ గాంధీపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని భాజపా యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కాంగ్రెస్‌ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ స్పందించారు. ‘జరిగిందంతా విూ కెమెరాల్లో కనబడి ఉండొచ్చు. నేను పార్లమెంట్‌ లోపలికి వెళ్తుండగా భాజపా ఎంపీలు నన్ను అడ్డుకొనే ప్రయత్నం చేశారు. తోసేశారు. బెదిరించారు. మల్లికార్జున్‌ ఖర్గేను కూడా నెట్టేశారు. మాకు లోపలికి వెళ్లే హక్కు ఉంది. కానీ, వారు అడ్డుకుంటున్నారు. ఇక్కడ ప్రధాన సమస్య ఏంటంటే.. రాజ్యాంగంపై వారు దాడి చేస్తున్నారు. అంబేడ్కర్‌ను అవమానించారు‘ అని రాహుల్‌ దుయ్యబట్టారు. భాజపా ఎంపీలే తమను అడ్డుకున్నారని ఆరోపిస్తూ అందుకు సంబంధించిన వీడియోను కాంగెస్‌ ’ఎక్స్‌’లో షేర్‌ చేసింది. అంతేగాక, ప్రస్తుత వ్యవహారంపై స్పీకర్‌ ఓం బిర్లాకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే లేఖ రాశారు. ‘ఆందోళన సమయంలో భాజపా ఎంపీలు నన్ను నెట్టేశారు. దాంతో నా మోకాలికి గాయమైంది‘ అని తెలిపారు. తోపులాట ఘటనపై విచారణ జరపాలని లేఖలో పేర్కొన్నారు. ఈ పరిణామాల వేళ పార్లమెంట్‌ ఉభయ సభలు మధ్యాహ్నానికి వాయిదా పడ్డాయి.
అంబేడ్కర్‌ అంశంపై దేశవ్యాప్త ఉద్యమం: రాహుల్‌తో కలిసి మీడియా సమావేశంలో ఖర్గే
భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేడ్కర్‌ను కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అవమానించారని, అందుకు క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది.కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా వ్యాఖ్యల్ని ఖండిస్తున్నట్లు కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పునరుద్ఘాటించారు. ఈ వ్యవహారంపై దేశ వ్యాప్తంగా ఉద్యమం చేపడతామన్నారు. దిల్లీలోని కాంగ్రెస్‌ ప్రధాన కార్యాలయంలో ఖర్గే, రాహుల్‌ సంయుక్తంగా విూడియా సమావేశం నిర్వహించారు. ’’అమిత్‌ షాను బర్త్‌రఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశాం. అది జరగదని మాకు తెలుసు. అందుకే నిరసనలు చేపట్టాం. అంబేడ్కర్‌పై అమిత్‌ షా వ్యాఖ్యల అంశం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు భాజపా ఇతర అంశాలను లేవనెత్తుతోంది. భాజపా ఎంపీలు మమ్మల్ని పార్లమెంటులోకి రానీయకుండా అడ్డుకున్నారు. నన్ను నెట్టారు. నేను బ్యాలెన్స్‌ తప్పి కింద పడ్డాను’’ అని ఖర్గే అన్నారు.భాజపా`ఆరెస్సెస్‌ ఆలోచన రాజ్యాంగానికి, అంబేడ్కర్‌కు వ్యతిరేకమని కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ అన్నారు. అంబేడ్కర్‌పై చేసిన వ్యాఖ్యలకు గాను అమిత్‌ షా క్షమాపణలు చెప్పి తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తున్నట్లు చెప్పారు. అలాగే, అదానీ వ్యవహరంపైనా తమ డిమాండ్‌ను లేవనెత్తుతామన్నారు.

 

అమిత్‌షాను భర్తరఫ్‌ చేయాలి
` రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌ శ్రేణుల ఆందోళనలు
` అసెంబ్లీ ముందు తెలంగాణ కాంగ్రెస్‌ నేతల ధర్నా
` తమకు దేవుడికన్నా ఎక్కువేనన్న టీపీసీసీ చీఫ్‌
అంబేడ్కర్‌ను అవమానించిన కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌ షాను బర్తరఫ్‌ చేయాలని తెలంగాణ కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. పార్లమెంట్‌ లో అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా తెలంగాణ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసనకు దిగారు. అమిత్‌ షా అంబేద్కర్‌ ను అవమానపరిచారని.. ఆయన వెంటనే రాజీనామా చెయ్యాలని డిమాండ్‌ చేస్తూ పీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో అసెంబ్లీలోని గాంధీ విగ్రహం దగ్గర ఆందోళన చేశారు.మంత్రులు పొన్నం ప్రభాకర్‌, జూపల్లి కృష్ణారావు ఆందోళనలో పాల్గొన్నారు. అంబేడ్కర్‌పై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్‌ ఈ ధర్నా చేస్తోంది. అంబేద్కర్‌ తమకు దేవుడు లెక్క అని, అమిత్‌ షా క్షమాపణలు చెప్పాలని పీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ ఈ సందర్భంగా డిమాండ్‌ చేశారు. రాజ్యాంగ వ్యతిరేకి అమిత్‌ షాను బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ అంబేడ్కర్‌ విగ్రహం వద్ద కాంగ్రెస్‌ నినాదాలు చేసింది. పీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ మాట్లాడుతూ.. ’మేము దేవుళ్లను ఆరాధిస్తాం. డా.బీఆర్‌ అంబేద్కర్‌ కూడా మాకు దేవుడు లెక్క. అంబేడ్కర్‌పై చేసిన వాఖ్యలు ప్రజల మనుసుని గాయపర్చాయి. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా మాటలు అగ్రవర్ణాల పోకడను గుర్తు చేసేలా ఉన్నాయి. అమిత్‌ షాను బర్థరఫ్‌ చేస్తే ప్రజల మనసుకు కలిగిన గాయానికి కొంత ఊరట కలిగినట్లు ఉంటుంది. వెంటనే ప్రధాని మోడీ స్పందించి అమిత్‌ షాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నాం అని పిసిసి చీఫ్‌ అన్నారు. ఈ ఆందోళనలో మంత్రి పొన్నంతో పాటు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్‌ వెంకటస్వామి, బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్‌ కుమార్‌,పలువురు ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. అంబేద్కర్‌..అంబేద్కర్‌. . అంబేద్కర్‌ అని అనడం ఈ మధ్య ఫ్యాషన్‌ అయిపోయింది.. అంబేద్కర్‌ పేరు కంటే.. దేవుడి పేరు స్మరించినా స్వర్గానికి వెళ్లేవారు అంటూ రాజ్యసభలో అమిత్‌ చేసిన వ్యాఖ్యలు గత రెండు రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. అంబేద్కర్‌ను నిండు సభలో అమిత్‌ షా అవమానించారని.. ఆయన వెంటనే రాజీనామా చేయాలని ప్రతిపక్ష పార్టీలు ఆందోళనకు దిగాయి. గురువారం కూడా పార్లమెంట్‌ భవనం ముందు కాంగ్రెస్‌తో పాటు ఇండియా కూటమిలోని ఇతర పార్టీల ఎంపీల పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. అంబేద్కర్‌ చిత్రపటాలను చేతిలో పట్టుకుని జై భీం.. జై జై భీం నినాదాలతో ఎంపీలు హోరెత్తించారు.