ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు
జహీరాబాద్ ఆగస్టు 20 (జనంసాక్షి):భారతరత్న స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 78వ జయంతి వేడుకలను జహీరాబాద్ పట్టణ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు.ముందుగా పార్టీ కార్యాలయం దగ్గర పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా పట్టణ మండల అధ్యక్షులు కండెం నర్సింలు, నరసింహ రెడ్డి లు మాట్లాడుతూ చిన్న వయస్సులోనే రాజీవ్‌గాంధీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారని ,ఆయన చేపట్టిన సంస్కరణలు చరిత్రలో నిలిచిపోయాయని అన్నారు.యువతకి 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించడం, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారని కొనియాడారు.బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం , పంచాయతీరాజ్ వ్యవస్థలో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారని గుర్తు చేశారు.రాజీవ్ గాంధీ రాజకీయాల్లోకి వచ్చాక దేశ చరిత్రలో కొత్త రికార్డులు నెలకొల్పారని కొనియాడారు.
రాజీవ్ గాంధీ ఆశయాలను నేటి తరం యువత స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో. జడ్పీటీసీ వినీల నరేశ్, మాజీ కౌన్సిలర్ లు తహెరా బేగం, రాజశేఖర్, మాజీ కో ఆప్షన్ సభ్యులు అక్బర్ హుస్సేన్, వైస్ ఎంపిపి రాములు, మండల ఉపాధ్యక్షుడు .మల్లారెడ్డి, భిమాశంకర్,మొగుడం పల్లి మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు గోపాల్ యువజన కాంగ్రెస్ నాయకులు మల్లికార్జున్,శేఖర్, జెహీర్, రాము, బబ్ల్యూ,నిజాం, కృష్ణ,ఖదీర్ ఖురేషి, మరియు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు ,కార్యకర్తలు, అభిమానులు,పాల్గొన్నారు..