జగన్ రిమాండ్ వచ్చే నెల 9కి పొడిగింపు
హైదరాబాద్:జగన్ అక్రమాస్తుల కేసులో తదుపరి విచారణను సీబీఐ కోర్టు అక్టోబర్ 9కి వాయిదా వేసింది. ఈకేసులో అరెస్టయిన జగన్, మాజీ మంత్రి మోపిదేవి, నిమ్మగడ్డ, బ్రహ్మానందరరెడ్డిలకు వచ్చే నెల 9 వరకు రిమాండ్‌ను పొడిగించింది, మంత్రి ధర్మాన ప్రసాదరావు, విజయసాయిరెడ్డి, నిమ్మగడ్డ ప్రకాష్,ఐఏఎస్ అధికారులు మన్మోహన్‌సింగ్, శామ్యూల్‌లపై విచారణను కూడా కోర్టు అక్టోబర్ 9కి వాయిదా వేసింది.



