జమ్మూకాశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..8 మంది మృతి
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లోని కుప్పారా జిల్లా కర్నాహ్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి అధికార యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టింది.



