జెసిఐ సెమినా సేవలు అభినందనీయం
శ్రీకాకుళం, జూలై 7 : ప్రతి ఒక్కరూ రక్తదానానికి ముందుకు రావాలని డిఆర్‌డిఎ పిడి పి.రజనీకాంతరావు పిలుపునిచ్చారు. రెడ్‌క్రాస్ సంస్థలో జెసిఐ సెమినా ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ స్థాయిలో రక్తదాతలు దినోత్సవాన్ని జరుపుకోవడం అభినందనీయమన్నారు. సెమినా మహిళలు విరివిగా రక్తదాన శిబిరాలు నిర్వహించడంపై ఆయన ప్రశంసించారు. జెసిఐ సెమినా అధ్యక్షురాలు పి.రజనీ మాట్లాడుతూ భవిష్యత్‌లో మరిన్ని రక్తదాన శిబిరాలు నిర్వహిస్తామన్నారు. యువతీయువకులు అపోహలు వదిలి రక్తదానానికి ముందుకు రావాలని కోరారు. జెసిఐ పూర్వ అధ్యక్షురాలు గీతాశ్రీకాంత్, అడ్వకెట్ ఎం.చిరంజీవి, రెడ్‌క్రాస్ చైర్మన్ జగన్మోహన్‌రావు తదితరులు పాల్గొనగా 35 మంది రక్తదానం చేశారు.