తాలిబన్లతో చేతులు కలపిన ఘనీ సోదరుడు


వారికి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటన
కాబూల్‌,ఆగస్ట్‌21(జనంసాక్షి): అఫ్ఘనిస్తాన్‌ మాజీ అధ్యక్షుడు అష్రాఫ్‌ ఘనీ సోదరుడు హస్మత్‌ ఘనీ అహ్మద్‌జాయి తాలిబన్లతో చేతులు కలిపారు. తాలిబన్లకు మద్దతు ఇవ్వనున్నట్లు హస్మత్‌ ప్రకటించినట్టు వార్తలు వస్తున్నాయి. మాజీ అధ్యక్షుడు అష్రాఫ్‌ ఘనీ దేశం విడిచి వెళ్లిన విషయం తెలిసిందే. రక్తపాతం సృష్టించవద్దు అన్న ఉద్దేశంతో దేశం విడిచి పారిపోయినట్టు ప్రకటించారు. అయితే ఇప్పుడు ఆయన సోదరుడు.. తాలిబన్లకు మద్దతు ఇస్తున్నట్టు వార్తలు రావడం అనుమానాలకు తావిస్తోంది.
దిలా ఉండగా డబ్బుతో తాను దేశం విడిచిపోయి పారిపోయినట్టు వస్తున్‌ వార్తలను అష్రాఫ్‌ ఘనీ ఖండిరచారు. కావాలంటే యూఏఈ కస్టమ్స్‌ అధికారులతో చెక్‌ చేసుకోవచ్చన్నారు. తనకు అప్పుడు షూ మార్చుకోవడానికే సమయం లేదన్నారు. తన భద్రత బలగాలు తనకు ముప్పు పొంచి ఉందని దేశాన్ని విడిచి వెళ్లాలని వారు తొందర పెట్టడంతో వెళ్లి పోయానన్నారు.