తెలంగాణ అలాయ్‌ బలాయ్‌

ఆ తర్వాత ఆ రిపోర్ట్‌ను ఎప్పుడు కూడా పబ్లి క్‌లోకి రానీయలేదు. 20 ఏళ్ల తర్వాత యూనిస్‌ సలీమ్‌ ‘షబిస్తాన్‌’ ఉర్దూ డైజెస్ట్‌లో ఒక ఇంటర్వ్యూ లో ఈ రిపోర్ట్‌ గురించి మామూలుగా ప్రస్తావిం చినప్పుడు పార్లమెంట్‌లో పెద్ద రభస జరిగిన సం ఘటనను బట్టి దాని నేచర్‌ను అర్థం చేసుకోవచ్చు యూనిస్‌ సలీమ్‌ చెప్పినదాన్ని బట్టి ఒక స్వతంత్ర పార్టీ మెంబర్‌ అతనిని భారత సైన్యం మీద అప నిందలు వేశారని నిందించాడు. పార్లమెంట్‌లో జరిగిన రభస వలస అప్పటి ప్రధాన మంత్రి ఇం దిరాగాంధీ హోం మినిస్ట్రీ నుంచి దాని ప్రతిని తెప్పించుకోని దానిని పరిశీలించిన తర్వాత జ తీయ భావనను భంగపరుస్తుందని భావించి దాని ని అణచివేసింది. ఈ నిస్పక్షపాతమైన సర్వే దేశం నిలువెల్లా ఒక్క మత కలహ సంఘటనైన జరగలే దని నెహ్రు చెప్పిన అబద్దాన్ని బద్దలుకొట్టింది. పటేల్‌ ప్రస్తావించిన విస్తృతమైన ఎంక్వయిరీ రిపోర్ట్‌ ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ప్రచురింపబ డలేదు. ఎక్కడా రికార్డై కూడా లేదు. ఈ రిపోర్ట్‌ యోక్క ప్రాధాన్యత సమకాలీన దస్తావేజులు తేనం దువలన ఇంకా పెరిగిపోతున్నది.

ఈ రిపోర్ట్‌లో సూచించన ప్రధాన సామూహి క హత్యాకాండ జరిగిన స్థలాలను బట్టి ఈ సర్వే యోక్క సమగ్రగతను అంచనా వేయగలం.ఈ విషయం ఈ రిపోర్ట్‌ సూచించిన వాస్తవత్వాన్ని కూడా తెలుపుతుంది. 2 లక్షల మంది ముస్లింల ను చంపిన విషయానికి క్రెడిబిలిటీనిస్తుంది. కేంద్ర హోం మినిష్ట్రిలో గాకుండా శ్రీనివాస్‌ లాహభాటీ అనే ఒక కమ్యూనిస్టు లీడర్‌ ఒక కాపీ కలిగి ఉండి నాడు. ఫిబ్రవరి 1988లో ఒక ఇంటర్వ్యూలో అత ను నేషనల్‌ అర్కైవ్స్‌ ఆఫ్‌ ఇండియా, న్యూడిల్లిలో ఆ కాపీని జమా చేశానని చెప్పాడు. ప్రస్తుత లేఖ కుడు కొద్దిబాగం ఇంగ్లీష్‌, కొద్దిబాగం ఉర్దూలో ఉన్న ఈ రిపోర్ట్‌ను అనామకంగా ఉండదలుచు కునే యజమానుల దగ్గర సంపాదించాడు. ఇంగ్లీ ష్‌లో ఉన్న పోర్షన్‌ను ఏదీ మార్చకుండా ప్రచురిస్తు న్నాను. ఉర్దూ పోర్షన్‌ ఇంగ్లీష్‌లో ట్రాన్స్‌లేట్‌ చేయ బడినది.

హ్రైద్రాబాద్‌ రాజ్యంలో మిలటరీ యాక్షన్‌కు ముందు సాధారణ పరిస్థితి శ్రాంతంగా ఉంది. నల్గోండ, వరంగల్‌ జిల్లాల్లో కమ్యూనిస్టులు చురు కుగా ఉండేవారు. రజాకార్లు ఇండియా ప్రావిన్స్‌ సరిహద్దుల్లోని నాందేడు, ఔరంగబాదు వంటి గ్రా మాల్లో నేరాలకు పాల్పడుతుండేవారు. హత్య లే దా కిడ్నాప్‌ వంటి సంఘలనలు చాలా అరుదు గా జరిగేవి. మిలటరీ యాక్షన్‌ తర్వాత , ఒక్క జిల్లాలో మాత్రమే విద్వాంసం, హింస చోటు చేసుకోలేదు. ఇది ముస్లింలు మాత్రమే బాధితులని సూచి స్తోంది. యాధృచ్చికంగా జరిగినా లేదా గండాల వల్ల ఏదైనా సంఘటన జరిగినా, ముస్లింలే వాటి పరిణామాల్ని అనుభవించాల్సి రావడంలో ఉన్న కారణం ఏదీ కనిపించదు. మరఠ్వాడా, తెలంగా ణాల్లోని జిల్లాలు, తాలుకాల్లో ముస్లింల ఇళ్లు, దుకాణాలు ధ్వంసం చేయబడ్డాయి.ధనిక, పేద ముస్లిం కుటుంబాలు రెండూ ఒకే విధంగా చేయ బడ్డాయి. ఇదంతా ఇండియన్‌ సైన్యం ముందే జరగడం దురదృష్టం సైనికులు నేరాల్ని ప్రోత్సా హించారానే దానికే కాదు, మామూలు జనాన్నిహీ నమైన నేరాలు చేసేట్టుగా బలవంత పెట్టారనడా నికి తిదుగులేని సాక్ష్యాలున్నై. మిలటరీ అధికారుల పద్ధతి బాగానే ఉండేది. కాని సైనికులే ద్వేషాన్ని ప్రధర్శించారు. వారి మూర్ఖపు ద్వేసషాన్ని ప్రద ర్శించే అవకాశం దోరికిన చోట పూర్తి స్థాయిలో చూపించేవారు. మిలటరీ యాక్షన్‌ తర్వాత, హిం దువులు పాలకులుగా వ్రర్తిస్తూ ముస్లింలని బాని సలుగా భావించేవారు.

రైళ్లలో సంఘటనలు

చాలాకాలం వరకు ముస్లింలు రైళ్లలో, బస్సు ల్లో ప్రయాణించడం ప్రమాదకరంగా ఉండేది. ఎవరైనా ముస్లిం రైలులో ప్రయాణించడం చూశా రంటే, బయటకు లాగి అరెస్టు చేసి కాన్‌సెం ట్రేషన్‌ క్యాంపుల్లోకి తరలించేవారు. రాజధాని నగ ర విధల్లో కూడా కొన్నిసార్లు ముస్లింలు స్వేచ్చగా బయట తిరగడం కష్టమైంది. హిందు వాలంటీర్లు వారిని అరెస్టు చేసి జైలుకు పంపించేవారు. ఇండి యన్‌ ఆర్మి ప్రోత్సాహంతో గ్రామస్తులు రోజూ ము స్లింల ఇళ్లు, రుకాణాల్ని దోచుకున్నారు.ఉదాహ రణకు ఆల్వాల్‌, బేగంపేట్‌, సికింద్రాబాద్‌ లోని ఇళ్లు, దుకాణాలు ఆర్మి కళ్లలముందే దోపిడికి, ధ్వంసానికి గురయ్యాయి. అయినప్పటికి జిల్లా కేం ద్రాల్లో శాంతి సాపేక్షంగా ఉండేది. గ్రామాల్లో శాంతి అంతంత మాత్రమే. గుండాల పాలన సాధారణమైంది. రాజధానికి గ్రాయమాల నుండి పారిపోయి వచ్చి తలదాచుకొన్న ముస్లింలు తిరిగి వెళ్లడానికి సాహసించలేకపోయేవారు. కొంత మంది తిరిగి వెళ్లినవారు చనిపోయారు లేదా హిం సకు గురయ్యారు.

అధికారుల ప్రవర్తన

యూనియన్‌ ప్రభుత్వ అధికారులు హైద్రా బాద్‌ అధికారులపట్ల చులకనగా వ్యవహరించే వారు. స్థానిక అధికారుల్ని సమావేశాలకు పిలవక పోయేవారు. సంప్రదించేవారు కాదు. అనేకసార్లు బహిరంగంగా హైద్రాబాద్‌ అధికారుల్ని హింసిం చేవారు. కొంతమంది యూనియన్‌ అధికాదుల గుండాల్ని అరికట్టి శాంతి, భద్రతలని నెలకోల్పే ప్రయత్నం చేశారు.ప్రయాత్నాల వల్ల సాపేక్ష శాం తి సాధ్యమైంది. అయితే, ఇలాంటి మంచి అధికా రులమీద హిందు గుండాలు పదేపదే ఫిర్యాదు చేయటంవల్ల శాంతి నెలకొల్పడం చాలా కష్టమైం ది. ముస్లింల భద్రతకు ప్రమాదంగా మారిన గ్రా మాల్లో చట్టాన్ని నెలకొల్పేందుకు కృషి చేస్తోన్న కిందిస్థాయి పోలిసు అఫీసర్లకు పై స్థాయి అధికా రులు మద్దతు నివ్వలేదు

షాహ్‌గర్‌, అంబర్‌ తాలూక, ఔరంగాబాద్‌ జిల్లా

సెప్టెంబర్‌ 15 ఉదయం ఎనిమిది గంటలకు వచ్చిన ఆర్మి గుండాలతో కలిసి సాయుధ దోపిడికి పాల్పడింది. ఎవరినీ చంపకుండా పదిమంది యువకుల్ని అరెస్టు చేసి అమరావతి జైలుకు తీసు కెళ్లారు. ఇండియన్‌ సైన్యం అనేక మంది స్త్రీలపై అత్యాచారం చేసింది.దోచుకున్న సోత్తు తిరిగివ్వ లేదు. దోషుల నెవ్వర్నీ అరెస్టు చేయలేదు. గొండి అంబర్‌ సబ్‌ ఇన్స్‌స్పేక్టర్‌ అఫ్‌ పోలిస్‌  సమియు ద్దీన్‌ను ఇండియన్‌ సైన్యాలు చంపేశాయి. హింస పతాక స్థాయిలో వున్నప్పుడు, స్థానికుడైన పండిట్‌ రావుపట్వారిముస్లింలకుఎంతోసహాయం చేశారు.

అంబర్‌, ఔరంగబాద్‌ జిల్లా

మోతిలాల్‌, షేక్‌ అబ్బాస్‌, అబ్దుల్‌ గఫార్‌ల ప్రకారం మిలటరీ ఆపరేషన్‌ ముందు రజాకార్లు ఎలాంటి నేరాలకు పాల్పడలేదు. ఇండియన్‌ ఆర్మి సెప్టెంబర్‌ 15 న వచ్చిన రోజు ఎలాంటి దోపిడి జరగలేదు. నాలుగు రోజుల తర్వాత, సైన్యం మ ద్దతుతో ముస్లింల దుకాణాలు, ఇళ్లు దోపిడి చేశా రు. ఆ తర్వాత, పోలీసులు కొద్ది విలువ చేసే వస్తు వుల్ని స్వాధీనం చేసుకుని బాధితులకప్పగిం చారు. జలీల్‌ అనే కోర్టు ప్యూన్‌ రాజ్‌పుట్‌కు చెంది న యువకుడి చేతిలో హత్యకు గురయ్యాడు. పీ. డబ్ల్యు.డీ డ్రైవర్‌ను సిక్కు సైనికులు కాల్చి చంపా రు. మరో ఇద్దరు గాయాలతో తప్పించుకున్నారు. ఇక్కడ సైనికులు అత్యాచారాలకు పాల్పడలేదు. కొంతమంది ముస్లింలు ఆర్మీ రాకతో పక్క గ్రామా లకు వెళ్లారు. అంబర్‌ తాలుకా తార్హద్‌ గ్రామంలో పటేల్‌ ముస్లింలకు సహాయం చేశాడు. ఇద్దరు జాంఖేడ్‌ గ్రామ ముస్లింల్ని సైనికులు కాల్చి చంపారు.

-వేముల ఎల్లయ్య, స్కైబాబ

ఇంకావుంది…