విజయ్ కుమార్ రెడ్డి గెలుపు చారిత్రక అవసరం!

 

 

 

 

హైదరాబాద్ (జనంసాక్షి) : మరికొన్ని రోజుల్లో జరగబోయే హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఎన్నికలు చారిత్రక సందర్భాన్ని గుర్తుచేస్తున్నాయి. సాక్షి దినపత్రిక రెసిడెంట్ ఎడిటర్ శ్రీగిరి విజయ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని ప్యానల్ ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో పోటీ చేస్తుంది. ఈ ప్యానల్ ఈసారి కచ్చితంగా గెలవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఎందుకంటే.. ప్రస్తుతం ఉన్న ప్రెస్ క్లబ్ స్థలం క్లబ్ పేరిట లేదు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రెస్ క్లబ్ స్థలం అన్యాక్రాంతం కాక తప్పదు. అంతేకాకుండా ఇక్కడి నుంచి తరలించే ప్రమాదం కూడా లేకపోలేదు. కాబట్టి ప్రెస్ క్లబ్ స్థలాన్ని కాపాడాలన్నా.. స్థలం క్లబ్ పేరు మీదికి మార్చాలన్నా విజయ్ కుమార్ రెడ్డిని గెలిపించి తీరాల్సిందే. ఇదే నినాదంతో విజయ్ కుమార్ రెడ్డి కూడా తనను గెలిపిస్తే ప్రెస్ క్లబ్ స్థలాన్ని కాపాడుతానని హామీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 26న జరగబోయే ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో విజయ్ కుమార్ రెడ్డి ప్యానెల్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మనవి.

ఎంఎం రహమాన్

ఎడిటర్, జనంసాక్షి