సీలింగ్ ఫ్యాన్​కు ఉరేసుకుని ఆత్మహత్య!

 

 

 

 

 

రాయికల్ అక్టోబర్26 (జనం సాక్షి )!రాయికల్ మండలం రామాజీపేట గ్రామానికి చెందిన దొడిమెళ్ళ మనోజ భర్త సుధాకర్ 27 సంవత్సరాలు కులం యాదవ అనునామేకు 9 సంవత్సరాల క్రితం రామాజీపేట గ్రామానికి చెందిన దొడిమెళ్ళ సుధాకర్ అనునతనితో వివాహం జరుగగా, ప్రస్తుతం ముగ్గులు పిల్లలు కలరు. శనివారం రోజున రాత్రి 9:30 గంటల సమయంలో తన భర్త మార్కెట్ నుంచి తిరిగి వచ్చేసరికి కూర వండకపోవడంతో ఎందుకు వండలేదని అడిగినందుకు అలిగి బెడ్రూంలోకి వెళ్లి గడివేసుకొని ఉండగా భర్త తలుపు కొట్టినా కూడా తీకపోవడంతో గ్రామస్తుల సహాయంతో కలిసి తలుపుని గొడ్డలి తో పగలగొట్టి చూడగా బెడ్ రూమ్ లోని సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకొని కనిపించగా ఊరి నుంచి తీసి చూడగా చనిపోయినది. దొడుమెల్లి మనోజ చిన్నప్పట్నుంచి గారాబంగా పెరిగినదని చిన్న పిల్ల మనస్తత్వమని తన భర్త ఎందుకు కూర ఎందుకు వండలేదని అడిగినందుకే మనస్థాపం చెంది జీవితంపై విరక్తితో ఇంట్లో గల సీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అని మృతురాలి తల్లి అయిన ముద్దం వెంకటి, వయస్సు 48 సంవత్సరాలు, భూపతిపూర్ గ్రామం అనునామె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రాయికల్ ఎస్ఐ సుధీర్ రావు తెలిపారు.