తెలంగాణ జేఏసీ అత్యవసర భేటీ

హైదరాబాద్‌: తెలంగాణ జిల్లాల్లో అరెస్టుల పరంపర కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణ రాజకీయ జేఏసీ అత్యవసరంగా సమావేశం అయింది. అక్రమ అరెస్టులపై చర్చించి ప్రభుత్వానికి, డీజీపీకి, హోంమంత్రికి ఫిర్యాదు చేయనున్నారు. అనుమతిచ్చినా కూడా అరెస్టులు ఎందుకు చేస్తున్నారని జేఏసీ నేతలు ప్రశ్నిస్తున్నారు.