దేశంలో కొత్తగా 34,457 కేసులు


న్యూఢల్లీి,ఆగస్ట్‌21(జనంసాక్షి): దేశంలో కొత్తగా 34,457 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,23,56,715కు చేరింది. ఇందులో 3,61,340 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడిరచింది. దీంతో యాక్టివ్‌ కేసుల సంఖ్య 151 రోజుల కనిష్ఠానికి చేరిందని తెలిపింది. కాగా, గత 24 గంటల్లో 375 మంది మరణించారని వెల్లడిరచింది. కాగా, శుక్రవారం 36,571 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. తాజా వాటి సంఖ్య 34 వేలకు తగ్గింది. దీంతో నిన్నటికంటే 5.7 శాతం తక్కువ అని తెలిపింది.