పారిశుద్య కార్మికులకు 5నెలలుగా జీతాలు లేవు

share on facebook

సిఐటియూ ఆధ్వర్యంలో ఆందోళన
గుంటూరు,ఆగస్టు 26(జనంసాక్షి): మంగళగిరి ` తాడేపల్లి కార్పొరేషన్‌లో విలీనం చేసిన గ్రామాల్లోని పంచాయతీ పారిశుధ్య కార్మికులకు 5 నెలల పెండిరగ్‌ వేతనాలు చెల్లించాలని, మున్సిపల్‌ కార్మికుల మాదిరే నెలకు రూ.18 వేల జీతం ఇవ్వాలని ఎంటిఎంసి సిఐటియు కన్వీనర్‌ ఎస్‌ఎస్‌ చెంగయ్య డిమాండ్‌ చేశారు. ఈ మేరకు పెదవడ్లపూడి, నూతక్కి గ్రామాల్లోని పారిశుధ్య కార్మికులు గురువారం ధర్నా చేశారు. నాయకులు మాట్లాడుతూ గ్రామాలను కార్పొరేషన్‌లో విలీనం చేశాక కూడా కార్మికులకు ఒక్కోచోట ఒక్కో
విధంగా జీతాలు ఇస్తున్నారని, రూ.5వేలు, రూ.8 వేలు, రూ.12 వేలు.. ఇలా ఉన్నాయని పేర్కొన్నారు. వడ్లపూడిలో 5 నెలలుగా జీతాలివ్వలేదని, అప్పులు కూడా పుట్టని పరిస్థితుల్లో కార్మికులు ఎలా బతకాలని ప్రశ్నించారు. పైగా సెలవులు కూడా ఇవ్వడం లేదని అన్నారు. జీతాలతోపాటు పిఎఫ్‌, ఇఎస్‌ఐ జమ చేయాలని, చెప్పులు, సబ్బులు, కొబ్బరి నూనె, గ్లౌజులు, మాస్కులు శానిటైజర్లు సత్వరం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అనంతరం సచివాలయాల్లో వినతి పత్రాలిచ్చారు. ఎర్రబాలెం ధర్నాలో రాజధాని ఏరియా పారిశుధ్య కార్మికులు సంఘం గౌరవాధ్యక్షులు ఎం.రవి మాట్లాడారు. కార్మికులకు పని భద్రత కల్పించాలని కోరారు. అనంతరం కార్యదర్శి కోటిరెడ్డికి వినతిపత్రం ఇచ్చారు.

Other News

Comments are closed.