ప్లేట్లు, పుస్తకాలు పంపిణీ
మార్కాపురం ,జూలై 24,: మండలంలోని మొద్దులపల్లి మండల ప్రాధమిక పాఠశాల విద్యార్థులకు మార్కాపురం వాసవీక్లబ్ ఆధ్వర్యంలో ప్లేట్లు, పుస్తకాలు, పలకలు, పెన్నులను పంపిణీ చేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు పివిఎస్ ప్రసాదరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వాసవీక్లబ్ సెక్రటరీ దోగిపర్తిబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో పాఠశాల అభివృద్ధికి పాటుపడతామని అన్నారు. క్లబ్ ప్రెసిడెంట్ టి శ్రీనివాసరావు ఒక కుర్చీని, ఎస్‌ఎంసి వైస్ ఛైర్మన్ బి కృష్ణయాదవ్ ఒక టేబుల్, బి నవభారతి రెండు కుర్చీలు, జి అల్లూరయ్య రెండు కుర్చీలు, ముద్దపాటి క్రిష్ణయ్య గోడగడియారం, స్టీలు వాటర్‌ట్యాంకు, బి శ్రీను ఒక కుర్చీని పాఠశాలకు అందచేశారు. పాఠశాల అభివృద్ధికి సహకరించిన వారిని గ్రామస్తులు అభినందించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రెసిడెంట్ శ్రీనివాసరావు, సెక్రటరీ ఎం నాగరాజు, ట్రెజరర్ ఎస్ కేశవరావు, తల్లిదండ్రులు, మరియు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.