మంత్రుల విదేశీ పర్యటనల వివరాలు బహిరంగ పరచండి

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రులు, సీనియర్‌ అధికారులు చేపట్టే దేశీ, విదేశీ పర్యటనల వివరాలను బహిరంగ పరచాలని కేంద్రం వివిధ మంత్రిత్వశాఖలకు సూచించింది. అధికారిక పర్యటన స్వభావం, సందర్శించిన ప్రాంతాలు, పర్యటన కాలం, అధికారుల బృంద సంఖ్య, మంత్రి లేదా అధికారి నిర్వహించిన సదరు పర్యటన ఖర్చు వంటి అంశాలన్నీ వివరాల్లో ఉండాలని నిర్దేశించింది.