రసాభాసగా మరిన ఎన్నికల సమావేశం

హుజూర్‌నగర్‌: నియోజకవర్గ తెదేపా సంస్థాగత ఎన్నికల సమావేశం రసాభాసగా ముగిసింది. మంగళవారం నియోజకవర్గంలోని మూడు మండలాలకు ఎన్నిక నిర్వహించాల్సిఉండగా గరిడేపల్లి, నేరేడుచర్ల మండలాలలో ఎన్నికకోసం పోటీపడి వాగ్వివాదానికి దిగారు. నాయకులు, కార్యకర్తలు తోపులాటతో పాటు కర్రలు తీసుకుని దాడులు చేసుకోవటంతో గరిడేపల్లికి చెందని ఇద్దరికి స్వల్పగాయాలనయ్యాయి. పోలీసులు లాఠీఛార్జిచేసి పరిస్థితిని అదుపుచేశారు.