రాజస్థాన్‌ చిచ్చు ఆరకముందే ..


పంజాబ్‌,ఛత్తీస్‌గడ్‌లలోనూ అసమ్మతి గళం
తలపట్టుకుంటున్న కాంగ్రెస్‌ అధిష్టానం
న్యూఢల్లీి,ఆగస్ట్‌25(జనంసాక్షి): రాజస్థాన్‌లో కాంగ్రెస్‌లో ఈ మధ్యే అసమ్మతి కుంపట్లు రాజుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో తనను నిర్లక్ష్యం చేస్తున్న కాంగ్రెస్‌ నుంచి వైదొలగి బిజెపిలో చేరాలని సచిన్‌ పైలట్‌ నిర్ణయించుకున్నట్లు పుకార్లు పుట్టాయి. దీంతో రాజస్థాన్‌లో కూడా మధ్యప్రదేశ్‌లాగా మల్లీ సంఓఓభం తలెత్తవచ్చని అంతా అనుకున్నారు. కానీ కొద్దిగా సద్దుమణిగింది. అయితే నివురుగప్పిన నిప్పులా ఎప్పుడు రాజుకుంటుందో తెలియని స్థితిలో ఉంది. ఇది చల్లారక ముందే పంజాబ్‌లో అగ్గి రాజుకుంటోంది. కాంగ్రెస్‌ పార్టీకి సరైన నాయకత్వం లేకపోవడంతో ఇప్పుడు రాష్టాల్ల్రో సమస్యలు వస్తున్నాయి. దీంతో అధినాయకత్వం తలపట్టుకునే పరిస్థితులు దాపురించాయి. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్న పంజాబ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్టాల్లో ఆ పార్టీ సంక్షోభం పడిరది. పార్టీ అంతర్గత విభేదాలతో కొట్టుమిట్టాడుతోంది. రెండు రాష్టాల్ల్రోనూ ముఖ్యమంత్రులను మార్చాలన్నదే ఆ పార్టీ నేతల ప్రధాన డిమాండ్‌. పంజాబ్‌ ముఖ్యమంత్రి పదవి నుంచి అమరీందర్‌ సింగ్‌ను తొలగించాలని అయిదుగురు మంత్రులతోసహా 31 మంది ఎమ్మెల్యేలు, ఆరుగురు మాజీ ఎమ్మెల్యేలు డిమాండ్‌ చేస్తున్నారు. వారంతా ఆ రాష్ట్ర మంత్రి రజీందర్‌సింగ్‌ బజ్వా నివాసంలో మంగళవారం సమావేశమయ్యారు. అమరీందర్‌ పార్టీ నాయకుల విశ్వాసం కోల్పోయారని, ఆయనను సీఎం పదవి నుంచి తొలగించాలని పార్టీ అధిష్ఠానవర్గానికి తెలియజేయాలని నిర్ణయించారు. పార్టీ
రాష్ట్ర అధ్యక్షుడు నవ్‌జోత్‌సింగ్‌ సిద్ధు ఈ సమావేశానికి హాజరుకాలేదు. కాగా, ఛత్తీస్‌గఢ్‌లో రొటేషన్‌ ఫార్ము లా ప్రకారం అక్కడ ముఖ్యమంత్రి భూపేష్‌బఘేల్‌ను మార్చాలన్నది ఆ రాష్ట్ర మంత్రి టీఎం సింగ్‌డియో డిమాండ్‌. 2018లో పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు రెండున్నరేళ్లు బఘేల్‌ సీఎంగా ఉంటారని, తరువాత ఆ బాధ్యతలు తనకు అప్పగిస్తారని హావిూ ఇచ్చినట్లు డియో చెప్పారు. వీరిద్దరూ మంగళవారం కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీతో మూడు గంటలసేపు సమావేశమయ్యారు. అయితే ఎలాంటి నిర్ణయం జరగలేదు. ఈ క్రమంలో పరిస్థితులను బిజెపి జాగ్రత్తగా గమనిస్తోంది. పంజాబ్‌లో వచ్చే ఏడు ఎన్నికలు జరగాల్సి ఉంది.