రాష్ట్రపతి ఎన్నికలయ్యాకే.. తెలంగాణపై కేంద్రం నిర్ణయం

పీసీసీ చీఫ్‌ బొత్స
న్యూఢిల్లీ, :
రాష్ట్రపతి ఎన్నిక తర్వాత తెలంగాణ సమస్యను అధిష్టానం పరిష్కరించ నున్నదని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చెప్పారు. శనివారంనాడు విలేకరులతో ఆయన మాట్లాడా రు. తెలంగాణ విషయా న్ని అది óష్టానం సీరియస్‌గా తీసుకుందని చెప్పారు. పెట్రో, నిత్యావసర ధరల పెంపు వల్లే ఉప ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను సాధిం చలేకపోయా మని చెప్పారు. ఉప ఎన్నికల్లో జగన్‌కు సానుభూతి తోడ్పడిందన్నారు. రాష్ట్రపతి అభ్యర్ధిగా ప్రణబ్‌ను బల పరుస్తూ తాను, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సంత కాలు చేశామని చెప్పారు. 2014 ఎన్నికల్లో విజయం సాధించేందుకు కృషి చేస్తామన్నారు. రాజ్యసభ సభ్యుడు చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై స్పందించబోనన్నారు. ఆ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమన్నారు. ఉప ఎన్నికల్లో అందరం కలిసే పనిచేశామన్నారు. ఒకేసారి కాకుండా విడతల వారీగా దాడులు నిర్వహించాలని అధికారులకు ఆదేశాలిచ్చామన్నారు. అనుమతి లేని వాహనాలను మాత్రమే సీజ్‌ చేస్తున్నామని తెలిపారు. ఫిట్‌నెస్‌ ఉన్న వాహనాలకు అనుమతి ఇస్తున్నామన్నారు. కొత్త రూట్లలో ఆర్టీసీ కొత్త సర్వీసులను నడపనున్నట్టు చెప్పారు.