లెప్ట్‌లో రాష్ట్రపతి ఎన్నికల చిచ్చు చీలిన వామపక్షాలు

ప్రణబ్‌కు సీపీఎం.. దూరంగా ఉండాలని సీపీఐ
న్యూఢిల్లీ :
రాష్ట్రపతి ఎన్నికల్లో వామపక్షాలు రెండుగా చీలిపోయాయి. అధికార, ప్రతిపక్ష అభ్యరు ్థలకు మద్దతు ఇచ్చే అంశంలో సిపిఎం, సిపిఐ పార్టీలు మధ్య భేదాభిప్రాయాలు తలెత్తాయి. అధికార యుపిఎ పక్షం ప్రతిపా దించిన రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్‌ ముఖర్జీకి మద్దతు ఇవ్వాలని భారత మార్క్సిస్ట్‌ కమ్యూనిస్ట్‌ పార్టీ (సిపిఎం) నిర్ణయిం చగా ఈ ఎన్నికలకు దూరంగా ఉండాలని భారత కమ్యూనిస్ట్‌ పార్టీ (సిపిఐ) నిర్ణయించింది. నాలుగు వామపక్ష పార్టీలలో రెండు ప్రణబ్‌కు మద్దతు ఇవ్వాలని, మిగిలిన రెండు ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాయి. రాష్ట్రపతి ఎన్నిక విషయానికి సంబంధించి మాత్రమే తమలో విభేదాలు ఉన్నాయని, మిగిలిన అన్ని అంశాలలో వామపక్ష సంఘటన (లెప్ట్‌ఫ్రంట్‌) ఐక్యంగానే ఉంటుందని, ఆర్‌ఎస్‌పి కూడా ఓటింగ్‌కు
దూరంగా ఉంటుందని సిపిఐ సీనియర్‌ నేత ఎబి బర్దన్‌ తెలిపారు. సిపిఎంలో కూడా ఈ ఎన్నిక కొంత చీలిక తెచ్చింది. సిపిఎం బెంగాల్‌ శాఖ ప్రణబ్‌ ముఖర్జీకి మద్దతు ఇవ్వాలని భావిస్తుండగా కేరళ శాఖ దీనిని వ్యతిరేకించింది. మొత్తం మీద ఈ సాయంత్రం జరిగిన వామపక్షాల సమావేశంలో సిపిఎం ప్రణబ్‌కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించడం కొసమెరుపు. ఎన్డీఎ మిత్రపక్షమైన జెడియు ప్రణబ్‌ ముఖర్జీకి మద్దతు ప్రకటించింది. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ప్రణబ్‌కు మద్దతు ఇస్తున్నామే తప్ప యుపిఎకు మద్దతు ఇచ్చినట్టు భావించరాదని ఆ పార్టీ అధ్యక్షుడు శరద్‌ యాదవ్‌ చెప్పారు. కాగా తనకు మద్దతు పలికిన బిజెపి, ఎస్‌ఎడి, ఎఐఎడిఎంకే, బిజెడి తదితరులకు రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేస్తున్న పి.ఎ. సంగ్మా కృతజ్ఞతలు తెలిపారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ కూడా తనకు మద్దతు ఇవ్వగలదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అయితే ఇంకా తమ పార్టీ ఎటు నిర్ణయించుకోలేదని అభిజ్ఞ వర్గాలు తెలిపాయి. రాష్ట్రపతి ఎన్నికలు రహస్య బ్యాలెట్‌ ద్వారా జరగనున్నందున ఓటర్లు తనకు అనుకూలంగానే ఓటు వేస్తారని సంగ్మా ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ ఎన్నికల్లో గెలుపుపై ఆయన ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. అంతకు ముందు బిజెపి సీనియర్‌ నేతలు సుష్మాస్వరాజ్‌, అరుణ్‌ జైట్లీ విలేకరులతో మాట్లాడుతూ సంగ్మాకు బిజెపి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు.
రాష్ట్రపతి అభ్యర్థులకు మద్దతు ఇస్తున్న పార్టీల వివరాలు ఇలా ఉన్నాయి
తృణమూల్‌ మినహా యుపిఎ, ఆర్‌జెడి, సమాజ్‌వాది పార్టీ, బిఎస్‌పి, ఎన్డీఎ మిత్రపక్షాలు (శివసేన, జెడియు) ప్రణబ్‌ ముఖర్జీకి మద్దతు ఇస్తున్నాయి. వీరి ఓట్ల శాతం 53.2.
పి.ఎ.సంగ్మాకు మద్దతు ఇస్తున్న పార్టీలలో బిజెపి, శిరోమణి అకాలీదళ్‌, బిజెడి, ఎఐఎడిఎంకే ఉన్నాయి. వీరి ఓట్ల శాతం 27.6. ఇప్పటివరకు తృణమూల్‌ కాంగ్రెస్‌ ఏ విషయం నిర్ణయించుకోలేదు ఈ పార్టీ, వామపక్షాలతో కలిసి ఓట్లశాతం 9గా ఉంది. ఇతరుల ఓట్లు 10.2 శాతంగా ఉంది.